ఫిల్మ్ స్టార్ భరత్ రెడ్డి ఎటు పోయిండబ్బా?

First Published 2, Dec 2017, 3:58 PM IST
where did bharatreddy disappear from the sight of world class hyderabad police
Highlights
  • ప్రపంచ నెంబర్ 1 పోలీసులకు సైతం చిక్కడంలేదా?
  • భరత్ రెడ్డి బిజెపి లీడరా? టిఆర్ఎస్ లీడరా?
  • భరత్ రెడ్డిని కాపాడుతున్నదెవరు?

హాలీవుడ్ బాలీవుడ్ సినీ స్టార్లను తలదన్నే రీతిలో యాక్టింగ్ చేశాడు నిజామాబాద్ జిల్లాలోని బిజెపి నేత భరత్ రెడ్డి. ఆయన నటనకు ప్రపంచంలోనే టాప్ మోస్ట్ అవార్డు దక్కడం కాయంగా చెబుతున్నారు. ఆస్కార్ తోపాటు దానికంటే పెద్ద అవార్డులు ఏమైనా ఉంటే అవి కూడా మన తెలంగాణ పటేలు భరత్ రెడ్డికే వచ్చేవని తెలంగాణవాదులు అంటున్నారు. మరి ఈ అవార్డులు తీసుకునేందుకైనా భరత్ రెడ్డి వస్తాడా? లేక ఆయన అండర్ గ్రౌండ్ లోనే అండర్ గ్రౌండ్ మాఫియా డాన్ మాదిరిగా తయారైతడా?

భరత్ రెడ్డి ఎటు పోయిండబ్బా అని నిజామాబాద్ ప్రజలే కాక యావత్ తెలంగాణ, తెలుగు ప్రజలంతా ఆసక్తిగా చర్చిస్తున్నారు. ఎందుకంటే ఈ తెలంగాణ పటేల్ దళితులను గబ్బు మాటలు తిడుతూ బండబూతులు తిడుతూ బరుగు తీసుకొని వాతులొచ్చేలా కొట్టిండు. కొట్టుడేకాదు మురికి నీళ్లలో ఇద్దరు దళిత యువకులను మునుగిపించుకుంట కొట్టిండు. అంతేకాకుండా ఆ తతంగాన్ని వీడియో తీపించి సోషల్ మీడియాలో అప్ లోడ్ చేసిండు. ఈ ఘటన పెద్ద దుమారం రేపింది. దళిత సంఘాలు, ప్రజా సంఘాలు అగ్గిమీద గుగ్గిలమైనయ్.

ఖతం.. అప్పటినుంచి భరత్ రెడ్డి ఎస్కేప్ అయిండు. అడ్రస్ దొరుకుతలేదు. ప్రపంచ ప్రసిద్ధి గాంచిన తెలంగాణ పోలీసులు సైతం భరత్ రెడ్డిని పట్టుకోలేకపోతున్నారు. ఇంతలో ఘటన జరిగింది. దెబ్బలు తిన్న ఇద్దరు దళిత యువకులు మాయమైపోయారు. 16 రోజులు వారి అడ్రస్ లేదు. వారిని భరత్ రెడ్డి మనుషులే కిడ్నాప్ చేశారన్న ప్రచారం నడిచింది. ఎట్టకేలకు వారు బయటకొచ్చారు. అంతేకాదు అసలు భరత్ రెడ్డి  మమ్మల్ని కొట్టనే కొట్టలేదు. ఉత్తుతిగానే యాక్షన్ చేసినం. ఇదంతా సినిమా షూటింగ్ అంటూ వారు మాట్లాడారు.

ఇంతవరకు బానే ఉంది. కానీ వారు తమ గ్రామానిక చేరుకున్న తర్వాత అసలు విషయం చెప్పిర్రు. భరత్ రెడ్డి మమ్మల్ని కొట్టింది నిజమేనని మాట్లాడారు. తమకు ప్రాణభయంతోనే సినిమా షూటింగ్ అని చెప్పినట్లు వివరించారు. ఈ ఇద్దరు యువకులు ఊరికి వచ్చినంక చెప్పినమాటలే నిజమని జనాలు అంటున్నారు. ఎందకంటే సినిమా షూటింగ్ అయితే బండబూతులు తిడతారా? ఆ బూతులన్నీ సినిమాల్లో డైలాగులుగా పెడతారా? ఇదంతా భరత్ రెడ్డి, పోలీసులు, కొందరు బిజెపి నేతలు, మరికొందరు టిఆర్ఎస్ నేతలు కలిసి ఆడించిన నాటకం అన్న అనుమానాలను దళిత సంఘాలు వ్యక్తం చేస్తున్నాయి.

నిజానికి భరత్ రెడ్డి ఏమైనా మాఫియా డాన్ అనుకోవాలా? పెద్ద పెద్ద కేసులను డీల్ చేసి ప్రపంచంలోనే బెస్ట్ పోలీసులుగా ప్రశంసలు అందుకుంటున్నట్లు చెప్పుకుంటున్న తెలంగాణ పోలీసులకు భరత్ రెడ్డి ఆచూకి దొరకబట్టుకోవడం కష్టమైన పనేనా? అయితే పోలీసులు నిజంగనే దొరికిచ్చుకోలేకపోతున్నరా? లేక వీళ్లు కూడా యాక్టింగ్ చేస్తున్నరా? అన్న అనుమానాలు కూడా వస్తున్నాయి. భరత్ రెడ్డి విషయంలో టిఆర్ఎస్, బిజెపి పార్టీలతోపాటు పోలీసులపైనా అనుమానాలను వ్యక్తం చేస్తున్నారు దళిత సంఘాల నేతలు.

loader