Asianet News TeluguAsianet News Telugu

గ్రామ పంచాయితీ ఎన్నికల ఎఫెక్ట్: ఎమ్మెల్యేల ప్రమాణం ఎప్పుడు

తెలంగాణ అసెంబ్లీకి  కొత్తగా ఎన్నికైన ఎమ్మెల్యేల ప్రమాణ స్వీకారం ఎఫ్పుడనే విషయమై ఇంకా స్పష్టత రాలేదు. తొలుత సంక్రాంతి తర్వాత కొత్త ఎమ్మెల్యే ప్రమాణం చేసే అవకాశాలు ఉన్నట్టు ప్రచారం సాగింది. 

when will the telangana assembly first meeting after elections
Author
Hyderabad, First Published Jan 2, 2019, 4:21 PM IST


హైదరాబాద్: తెలంగాణ అసెంబ్లీకి  కొత్తగా ఎన్నికైన ఎమ్మెల్యేల ప్రమాణ స్వీకారం ఎఫ్పుడనే విషయమై ఇంకా స్పష్టత రాలేదు. తొలుత సంక్రాంతి తర్వాత కొత్త ఎమ్మెల్యే ప్రమాణం చేసే అవకాశాలు ఉన్నట్టు ప్రచారం సాగింది. కానీ, ఎన్నికల షెడ్యూల్ విడుదల కావడంతో  కొత్తగా ఎన్నికైన ఎమ్మెల్యేల ప్రమాణం చేసేందుకు అసెంబ్లీ సమావేశపర్చాలంటే  ఎన్నికల సంఘ: అనుమతి తప్పనిసరిగా మారింది.

తెలంగాణ అసెంబ్లీకి గత ఏడాది డిసెంబర్ 7వ తేదీన ఎన్నికలు జరిగాయి. ఈ ఎన్నికల్లో  టీఆర్ఎస్  88 స్థానాల్లో విజయం సాధించింది. ఇద్దరు ఇండిపెండెంట్ ఎమ్మెల్యేలు కూడ టీఆర్ఎస్‌లో చేరారు. కాంగ్రెస్ పార్టీ 19,  టీడీపీ రెండు స్థానాల్లో, బీజేపీ ఒక్క స్థానంలో  ఎంఐఎం 8 స్థానాల్లో  విజయం సాధించింది.

ఈ ఎన్నికల్లో విజయం సాధించిన ఎమ్మెల్యేలు ప్రమాణ స్వీకారం ఇంకా చేయలేదు.  కొత్తగా ఎన్నికైన ఎమ్మెల్యేలు  60 రోజుల్లోపుగా ఎప్పుడైనా ప్రమాణం చేయవచ్చు. ఈ నెల 11వ తేదీ వస్తే ఎమ్మెల్యేలుగా విజయం సాధించి  దాదాపుగా ఒక్క మాసం పూర్తి కానుంది. 

ఎన్నికల ప్రక్రియ పూర్తైందని ఎన్నికల సంఘం అధికారికంగా ప్రకటించిన రోజు నుండే కొత్తగా ఎన్నికైన ఎమ్మెల్యేల పదవీ కాలం లెక్కలోకి వస్తోంది. అంటే గత ఏడాది డిసెంబర్ 13వ తేదీన తెలంగాణలో ఎన్నికల ప్రక్రియ పూర్తైందని ఎన్నికల సంఘం ప్రకటించింది. దీంతో అదే రోజు నుండి కొత్తగా ఎన్నికైన ఎమ్మెల్యేల పదవీ కాలం లెక్కలోకి వస్తోంది.

ఇదిలా ఉంటే కొత్తగా ఎన్నికైన ఎమ్మెల్యేల ప్రమాణ కార్యక్రమానికి గ్రామ పంచాయితీ ఎన్నికలు అడ్డంకిగా మారాయి. అసెంబ్లీ సమావేశాలు నిర్వహించాలంటే ఎన్నికల కోడ్ ఉన్నందున  ఎన్నికల సంఘం  అనుమతితోనే  అసెంబ్లీని సమావేశపర్చాల్సి ఉంటుంది.

అసెంబ్లీలో కీలకమైన అంశంపై మొదటి సమావేశాల్లోనే  ఓటింగ్ జరిగే పరిస్థితి ఉంటే ఎమ్మెల్యేలు తప్పనిసరిగా  ప్రమాణం చేయాల్సిందే. అయితే ఒకవేళ సంక్రాంతి తర్వాత కొత్త ఎమ్మెల్యేలు ప్రమాణం  చేయాలంటే  ఎన్నికల సంఘం అనుమతి తీసుకొని  అసెంబ్లీని సమావేశపర్చాల్సి ఉంటుంది. గ్రామ పంచాయితీ ఎన్నికల తర్వాతే కొత్తగా ఎన్నికైన ఎమ్మెల్యే ప్రమాణ స్వీకారం ఉంటుందనే ప్రచారం కూడ లేకపోలేదు.   

సంబంధిత వార్తలు

కారణమిదే: బతుకమ్మ చీరెలు, రైతు బంధు చెక్కుల నిలిపివేత
గ్రామ పంచాయితీ ఎన్నికల షెడ్యూల్ విడుదల: మూడు విడతల్లో పోలింగ్

Follow Us:
Download App:
  • android
  • ios