Asianet News TeluguAsianet News Telugu

కారణమిదే: బతుకమ్మ చీరెలు, రైతు బంధు చెక్కుల నిలిపివేత

గ్రామ పంచాయితీ ఎన్నికల షెడ్యూల్ విడుదల చేసినందున బతుకమ్మ చీరెల పంపిణీ, రైతు బంధు చెక్కుల పంపిణీని నిలిపివేయాలని ఎన్నికల సంఘం ఆదేశించింది. 

election commission orders to stop bathukamma saree distribution
Author
Hyderabad, First Published Jan 2, 2019, 3:18 PM IST

హైదరాబాద్:గ్రామ పంచాయితీ ఎన్నికల షెడ్యూల్ విడుదల చేసినందున బతుకమ్మ చీరెల పంపిణీ, రైతు బంధు చెక్కుల పంపిణీని నిలిపివేయాలని ఎన్నికల సంఘం ఆదేశించింది. ఈ నెల 30వ తేదీ వరకు గ్రామ పంచాయితీ ఎన్నికలు జరుగుతాయి. ఎన్నికల కోడ్ అమల్లో ఉన్నందున ఎన్నికల సంఘం ఈ నిర్ణయం తీసుకొంది.

తెలంగాణ రాష్ట్రంలో మూడు విడతలుగా గ్రామ పంచాయితీ  ఎన్నికలను నిర్వహించాలని  ఎన్నికల సంఘం నిర్ణయం తీసుకొంది.ఈ మేరకు  జనవరి 1వ తేదీన ఎన్నికల షెడ్యూల్‌ను విడుదల చేసింది.

రాష్ట్రంలో ఎన్నికల కోడ్ అమల్లో ఉందని  ఎన్నికల సంఘం ప్రకటించింది. ఈ పరిస్థితుల్లో విధాన పరమైన నిర్ణయాలు తీసుకోకూడదని  ఎన్నికల సంఘం ఆదేశాలు జారీ చేసింది. 

ఇటీవల ముగిసిన అసెంబ్లీ ఎన్నికల సమయంలో బతుకమ్మ చీరెల పంపిణీని నిలిచిపోయింది.ఆ సమయంలో కూడ ఎన్నికల కోడ్ కారణంగానే  చీరెల పంపిణీ నిలిపివేశారు. ఎన్నికలు ముగిశాయి. కొత్తగా ఎన్నికైన ఎమ్మెల్యేలు  బతుకమ్మ చీరెల పంపిణీని చేపట్టారు.

ఈ సమయంలో మరోసారి గ్రామ పంచాయితీ ఎన్నికల షెడ్యూల్ విడుదలైంది. ఈ తరుణంలో మరోసారి బతుకమ్మ చీరెల పంపిణీని నిలిపివేయాలని ఎన్నికల సంఘం ఆదేశాలు జారీ చేసింది. రైతు బంధు పథకం కింద చెక్కుల పంపిణీని కూడ నిలిపివేయాలని  కూడ  ఎన్నికల సంఘం ఆదేశాలు జారీ చేసింది.

 స్థానిక సంస్థలకు చెందిన పాలక మండళ్లు ఉంటే  ఆ పాలక మండళ్లు ఉన్న చోట  వెంటనే  సమావేశాలను యధావిధిగా నిర్వహించుకోవచ్చని  ప్రకటించింది.  కానీ, కీలక నిర్ణయాలు తీసుకోకూడదని కూడ ప్రకటించింది.

ఐఎఎస్, ఐపీఎస్ అధికారుల బదిలీలుమంత్రివిస్తరణ చేయకూడదని కూడ ఎన్నికల సంఘం ఆదేశాలు జారీ చేసింది. అత్యవసరమైతే ఎవరైనా ప్రతి రోజూ రూ. 50వేల నగదును మాత్రమే వెంట తీసుకెళ్లాలని ఎన్నికల సంఘం ఆదేశాలు జారీ చేసింది.

సంబంధిత వార్తలు

గ్రామ పంచాయితీ ఎన్నికల షెడ్యూల్ విడుదల: మూడు విడతల్లో పోలింగ్

 


 

Follow Us:
Download App:
  • android
  • ios