వికారాబాద్: వికారాబాద్ జిల్లా పరిగి టీఆర్ఎస్ నేత నారాయణ రెడ్డి హత్య కేసులో ట్విస్ట్ చోటు చేసుకొంది. ఓ ప్రేమ జంట విషయంలో మధ్యవర్తిగా నారాయణరెడ్డి వ్యవహరించడంతో  ప్రత్యర్థులు  మంగళవారం నాడు ఆయనపై దాడికి పాల్పడ్డారని పోలీసులు అనుమానిస్తున్నారు. ఇదిలా ఉంటే తన తండ్రిని  రాజకీయంగా ఎదుర్కోలేకనే ప్రత్యర్థులు హత్య చేశారని కొడుకు మధుసూధన్ రెడ్డి ఆరోపిస్తున్నాడు.

టీఆర్ఎస్‌ నేత నారాయణ రెడ్డి ఇంట్లో మల్లేష్ అనే వ్యక్తి పనిచేస్తున్నాడు. మల్లేష్  ఓ యువతిని  ప్రేమించాడు. అయితే ఆ యువతికి కృష్ణ అనే  మరో వ్యక్తితో ఎంగేజ్‌మెంట్ జరిగింది.

అయితే ఈ ప్రేమ విషయంలో నారాయణరెడ్డి మల్లేష్‌కు మద్దతిచ్చాడు. దీంతో కృష్ణతో పాటు ఆయన బంధువులు  నారాయణరెడ్డిపై కక్ష పెంచుకొన్నాడు. మంగళవారం నాడు ఉదయం వాకింగ్ వెళ్తుండగా నారాయణరెడ్డిని కృష్ణ బంధువులు కొట్టి చంపారని పోలీసులు  అనుమానిస్తున్నారు.

నారాయణరెడ్డిని కొట్టి చంపిన నిందితులను  పోలీసులు అదుపులోకి తీసుకొని ప్రశ్నిస్తున్నారు.మరోవైపు నారాయణరెడ్డి హత్య వెనుక రాజకీయకోణం ఏమైనా ఉందా  అనే విషయమై కూడ పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. 

ఇదిలా ఉంటే  తన తండ్రిని రాజకీయంగా ఎదుర్కొలేకనే  హత్య చేశారని నారాయణ రెడ్డి  కొడుకు మధుసూధన్ రెడ్డి ఆరోపించారు. వారం రోజులుగా   రెక్కీ నిర్వహించి తన తండ్రిని మట్టుబెట్టారని ఆయన ఆరోపించారు..

సంబంధిత వార్తలు

వికారాబాద్ జిల్లాలో కలకలం... టీఆర్ఎస్ నేత దారుణహత్య