ఎన్నికల వేళ వికారాబాద్ జిల్లాలో టీఆర్ఎస్‌కు షాక్ తగిలింది.. పరిగి మండలం సుల్తాన్‌పూర్‌కు చెందిన కీలక నేత నారాయణరెడ్డిని ప్రత్యర్థులు దారుణంగా హతమార్చారు. 

ఎన్నికల వేళ వికారాబాద్ జిల్లాలో టీఆర్ఎస్‌కు షాక్ తగిలింది.. పరిగి మండలం సుల్తాన్‌పూర్‌కు చెందిన కీలక నేత నారాయణరెడ్డిని ప్రత్యర్థులు దారుణంగా హతమార్చారు. గత కొంతకాలంగా ఆయనకు గ్రామస్తులకు మధ్య గొడవలు జరుగుతున్నాయి..

గతంలో నారాయణరెడ్డికి అనుచరులుగా ఉన్న వారే కొద్దిరోజుల క్రితం కాంగ్రెస్‌లో చేరారు. దీంతో అప్పటి నుంచి ఇరువర్గాల మధ్య వైరం నెలకొంది. ఈ క్రమంలో ఉదయం పొలానికి వెళ్తున్న నారాయణరెడ్డిపై అక్కడే మాటు వేసిన కొందరు యువకులు కర్రలు, రాళ్లతో దాడి చేశారు.

ఈ దాడిలో తీవ్రంగా గాయపడిన ఆయన అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయాడు. నారాయణరెడ్డి హత్యతో రెచ్చిపోయిన ఆయన వర్గీయులు కాంగ్రెస్ నాయకులపై దాడికి దిగారు.. స్థానిక నేత ఒకరిని చితకబాదారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటానా స్థలికి చేరుకుని నారాయణరెడ్డి మృతదేహాన్ని పోస్ట్‌మార్టం నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. ఉద్రిక్తతలు తలెత్తకుండా గ్రామంలో పికెట్ ఏర్పాటు చేశారు.