9 ఏళ్లలో తెలంగాణకు కేసీఆర్, కేటీఆర్ ఏం చేశారు?: బీజేపీ
Hyderabad: గవర్నర్ కోటాలో శాసనమండలికి అధికార పార్టీ భారత రాష్ట్ర సమితి (బీఆర్ఎస్) నాయకులు దాసోజు శ్రావణ్ కుమార్, కే సత్యనారాయణలను నామినేట్ చేయాలన్న రాష్ట్ర ప్రభుత్వ ప్రతిపాదనను గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ సోమవారం తిరస్కరించారు. దీంతో మరోసారి రాజ్ భవన్-సర్కారు మధ్య విభేధాలు భగ్గుమన్నాయి. ఇదే సమయంలో బీఆర్ఎస్-బీజేపీ నాయకుల మధ్య మాటల యుద్ధం మొదలైంది.
Telangana BJP: తెలంగాణ ముఖ్యమంత్రి, భారత రాష్ట్ర సమితి (బీఆర్ఎస్) అధినేత కల్వకుంట్ల చంద్రశేఖర రావు (కేసీఆర్), ఆయన తనయుడు మంత్రి కేటీ రామారావుల (కేటీఆర్) లను టార్గెట్ చేస్తూ భారతీయ జనతా పార్టీ (బీజేపీ) నాయకులు తీవ్ర విమర్శలు గుప్పిస్తున్నారు. ఈ క్రమంలోనే బీజేపీ అధికార ప్రతినిధి ఎన్వీ సుభాష్ తీవ్రస్థాయిలో వారిపై ధ్వజమెత్తారు. గత తొమ్మిదేళ్లలో కేసీఆర్, కేటీఆర్ తెలంగాణకు ఏం చేశారని ఎన్వీ సుభాష్ ప్రశ్నించారు. ప్రధాని నరేంద్ర మోడీ రాష్ట్రానికి నిధులు ఇస్తుంటే వాటిని దారి మళ్లిస్తున్నారు. నిధులన్నీ దారి మళ్లించి కొంత ముడుపులు పొందగలుగుతున్నారని ఆరోపించారు.
"మీరు పరీక్ష కూడా నిర్వహించలేరు. స్టేట్ పీసీఎస్ 17 సార్లు వాయిదా పడింది. పలు మార్లు రద్దు చేశారు. రాష్ట్రంలో 30 లక్షల మంది యువత ప్రభుత్వ ఉద్యోగాల కోసం ఎదురు చూస్తున్నారు. వారి జీవితాలను చెలగాటం ఆడుతున్నారు. ఇదే సమయంలో అభివృద్ధి ప్రాజెక్టుల కోసం కేంద్రానికి భూములు కేటాయించడం లేదు. దీనివల్ల రాష్ట్రంలోని అనేక ప్రాజెక్టులు పెండింగ్ లో ఉన్నాయని" ఎన్వీ సుభాష్ విమర్శించారు. ఇద్దరు బీఆర్ఎస్ ఎమ్మెల్సీ అభ్యర్థులను తెలంగాణ గవర్నర్ తిరస్కరించడంపై తెలంగాణ మంత్రి కేటీఆర్ చేసిన వ్యాఖ్యలపై ఆయన స్పందిస్తూ.. ఇలాంటి నామినేషన్లు సమాజం కోసం పనిచేసే వారి కోసమే తప్ప ఎక్కడో తమ విధేయతను ఫిక్స్ చేసుకున్న వారి కోసం కాదని అన్నారు.
గవర్నర్ కోటాలో శాసనమండలికి అధికార పార్టీ భారత రాష్ట్ర సమితి (బీఆర్ఎస్) నాయకులు దాసోజు శ్రావణ్ కుమార్, కే సత్యనారాయణలను నామినేట్ చేయాలన్న రాష్ట్ర ప్రభుత్వ ప్రతిపాదనను గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ సోమవారం తిరస్కరించారు. దీంతో మరోసారి రాజ్ భవన్-సర్కారు మధ్య విభేధాలు భగ్గుమన్నాయి. ఇదే సమయంలో బీఆర్ఎస్-బీజేపీ నాయకుల మధ్య మాటల యుద్ధం మొదలైంది. రాష్ట్ర గవర్నర్లు ప్రధాని నరేంద్ర మోడీ ఏజెంట్లు అని ఆరోపించిన బీఆర్ఎస్ నేత కేటీ రామారావు.. తెలంగాణ గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ వైఖరిని ఖండించారు. గవర్నర్ కాకముందు ఆమె (తమిళిసై సౌందరరాజన్) బీజేపీ తమిళనాడు రాష్ట్ర అధ్యక్షురాలిగా ఉన్నారు. ఎవరిని ఎమ్మెల్సీగా నామినేట్ చేయాలనేది తమ హక్కుగా పేర్కొంటూ.. గవర్నర్ వైఖరిని తీవ్రంగా ఖండిస్తున్నామని చెప్పారు.
ఈ ఏడాది అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో అక్టోబర్ 1న మహబూబ్ నగర్ లో బీజేపీ నిర్వహించే బహిరంగ సభలో ప్రధాని మోడీ ప్రసంగించనున్నారు. తెలంగాణలో బీజేపీ, అధికార టీఆర్ఎస్, కాంగ్రెస్ పార్టీల మధ్య ముక్కోణపు పోటీ నెలకొంది. కీలకమైన 2024 లోక్ సభ ఎన్నికలకు ముందు బీజేపీ నేతృత్వంలోని ఎన్డీయే, బీజేపీ కూటమికి తెలంగాణ ఎన్నికలు ఒక పరీక్షగా నిలవనుంది. తెలంగాణతో పాటు మధ్యప్రదేశ్, రాజస్థాన్, చత్తీస్ గఢ్, మిజోరాం రాష్ట్రాల్లో కూడా ఈ ఏడాది చివర్లో ఎన్నికలు జరగనున్నాయి.