తెలంగాణ సీఎంకు డబ్ల్యూఈఎఫ్ ప్రశంస దావోస్ సమావేశానికి ఆహ్వానం

వచ్చే ఏడాది జనవరిలో దావోస్‌లో జరిగే వార్షిక సమావేశానికి రావాలని ప్రపంచ ఆర్థిక వేదిక (డబ్ల్యూఈఎఫ్‌) తెలంగాణ సీఎం కేసీఆర్‌ను ఆహ్వానించింది.ఈజీ డూయింగ్ ఆఫ్ బిజినెస్ లో తెలంగాణ రాష్ట్రం టాప్ ప్లేస్ లో నిలవడంపై తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వానికి వరల్డ్ ఎకనామిక్ ఫోరమ్ అభినందనలు తెలిపింది. సీఎం కేసీఆర్ నాయకత్వం, రాష్ట్ర ప్రణాళికల వల్లే ఈ స్థాయి ర్యాంక్ సాధించారని డబ్ల్యూఈఎఫ్‌ పేర్కొంది. ఈ మేరకు డబ్ల్యూఈఎఫ్‌ వ్యవస్థాపకుడు, ఎగ్జిక్యూటివ్‌ ఛైర్మన్‌ నుంచి సీఎం కేసీఆర్‌కు లేఖ అందింది. డిజిటల్‌, ఇంటర్నెట్ విభాగాల్లో తెలంగాణ ప్రభుత్వంతో కలిసి పనిచేస్తున్నందుకు గర్వకారణంగా ఉందని డబ్ల్యూఈఎఫ్‌ ఈ లేఖలో పేర్కొంది.