Asianet News TeluguAsianet News Telugu

రావడం లేదు,మరో రోజు బోర్డు మీటింగ్ పెట్టండి: జీఆర్ఎంబీ ఛైర్మెన్ కు తెలంగాణ ఈఎన్సీ లేఖ

ఈ నెల 9వ తేదీన జీఆర్ఎంబీ, కేఆర్ఎంబీ సంయుక్త సమావేశం ఏర్పాటు చేశారు.ఈ సమావేశానికి తాము రావడం లేదని జీఆర్ఎంబీ చైర్మెన్ కు తెలంగాణ ఈఎన్సీ  గురువారం నాడు లేఖ రాశారు. కోర్టు కేసుల కారణంగా ఈ సమావేశానికి రాలేమని మురళీధర్ ఆ లేఖలో పేర్కొన్నారు. 
 

we won't attend:  TS irrigation ENC writes letter to GRMB chairman lns
Author
Hyderabad, First Published Aug 5, 2021, 5:03 PM IST

హైదరాబాద్: గోదావరి నదీ యాజమాన్య బోర్డు సమావేశానికి రాలేమని తెలంగాణ తేల్చి చెప్పింది. ఈ నెల 9వ తేదీన కేఆర్ఎంబీ, జీఆర్ఎంబీ సంయుక్త సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సమావేశానికి హాజరు కావాలని తెలంగాణ, ఏపీ రాష్ట్రాల నీటి పారుదల శాఖాధికారులకు కేఆర్ఎంబీ ఛైర్మెన్ లేఖ రాశారు.కేంద్ర ప్రభుత్వం ఇటీవల విడుదల చేసిన గెజిట్ లోని అంశాలను  నిర్ణీత షెడ్యూల్‌లోపుగా పూర్తి చేయాలని కేంద్రజల్ శక్తి కార్యదర్శి బోర్డులకు లేఖ రాశారు.ఈ విషయమై చర్చించేందుకు లేఖలు రాశారు. రెండు రోజుల క్రితం నిర్వహించిన సమావేశానికి తెలంగాణ అధికారులు హాజరు కాలేదు.

also read:ఆగష్టు 9న కేఆర్ఎంబీ,జీఆర్ఎంబీ ఉమ్మడి సమావేశం: తెలంగాణ ఈ సారి హాజరయ్యేనా?

ఈ నెల 9వ తేదీన జరిగే సమావేశానికి కూడ హాజరుకాలేమని తెలంగాణ నీటిపారుదల ఇంజనీర్ ఇన్ చీఫ్ మురళీధర్  గోదావరి నదీ యాజమాన్య  బోర్డు (జీఆర్ఎంబీ) ఛైర్మెన్ కు లేఖ రాశారు. సుప్రీంకోర్టు, ఎన్జీటీల్లో కేసులున్న నేపథ్యంలో  ఈ సమావేశానికి హాజరు కాలేమని ఆయన  ఆ లేఖలో పేర్కొన్నారు. బోర్డు సమావేశానికి మరో తేదీని నిర్ణయించాలని ఆయన ఆ లేఖలో కోరారు.ఉమ్మడి ప్రాజెక్టులపై కేంద్రప్రభుత్వం ఇటీవలనే గెజిట్ నోటిఫికేషన్ జారీచేసింది. ప్రాజెక్టులను బోర్డుల పరిధిలోకి తీసుకొస్తూ గెజిట్ విడుదల చేసింది కేంద్రం . ఈ గెజిట్ ను తెలంగాణ ప్రభుత్వం తీవ్రంగా వ్యతిరేకిస్తోంది.
 

Follow Us:
Download App:
  • android
  • ios