దుబ్బాక ఎన్నికల్లో భారీగా నమోదైన పోలింగ్ తమకు అనుకూలంగా ఉంటుందని బీజేపీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ చెప్పారు. 

హైదరాబాద్: దుబ్బాక ఎన్నికల్లో భారీగా నమోదైన పోలింగ్ తమకు అనుకూలంగా ఉంటుందని బీజేపీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ చెప్పారు.

దుబ్బాక ఓటింగ్ పూర్తైన తర్వాత మంగళవారం నాడు సాయంత్రం ఆయన హైద్రాబాద్ లోని బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో మీడియాతో మాట్లాడారు.టీఆర్ఎస్ కు బీజేపీ ప్రత్యామ్నాయమని ప్రజలు గుర్తించారని ఆయన చెప్పారు.దుబ్బాక ఉప ఎన్నికల్లో టీఆర్ఎస్ తమపై తప్పుడు ప్రచారం చేసిందన్నారు. 

also read:విజయశాంతి బిెజెపిలో ఎప్పుడు చేరుతోందో తెలియదు: బండి సంజయ్

కేసీఆర్ సర్కార్ అనుసరించిన విధానాలను నిరసిస్తూ దుబ్బాక ఓటర్లు తమకు ఓటు చేస్తారని ఆయన ధీమాను వ్యక్తం చేశారు. కేసీఆర్ విధానాలకు వ్యతిరేకంగా దుబ్బాక ఓటర్లు ఓటు చేశారన్నారు.

జీహెచ్ఎంసీ ఎన్నికలే తమ పార్టీ టార్గెట్ అని ఆయన చెప్పారు.దుబ్బాక అసెంబ్లీ ఉప ఎన్నికల్లో బీజేపీ అభ్యర్ధి రఘునందన్ రావు పోటీ చేశారు. గత రెండు దఫాలుగా ఈ స్థానం నుండి రఘునందన్ రావు పోటీ చేశారు.

ఇవాళ ఉదయం నుండి ఓటు చేసేందుకు పోలింగ్ బూత్ ల వద్ద పెద్ద ఎత్తున ఓటర్లు బారులు తీరారు. సాయంత్రం 6 గంటల వరకు క్యూ లైన్లలో నిల్చున్న వారికి కూడ ఓటు హక్కును వినియోగించుకొనేందుకు అవకాశం కల్పించారు.