వచ్చే ఎన్నికల్లో తెలంగాణలో 80 స్థానాల్లో గెలుపు: కాంగ్రెస్ ఇంచార్జ్ మాణికం ఠాగూర్

వచ్చే ఎన్నికల్లో తమ పార్టీ రాష్ట్రంలో 70 నుండి 80 అసెంబ్లీ స్థానాల్లో విజయం సాధిస్తామని కాంగ్రెస్ పార్టీ తెలంగాణ రాష్ట్ర వ్యవహారాల ఇంచార్జీ మాణికం ఠాగూర్ చెప్పారు.భువనగిరి ఎంపీ కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి నివాసంలో జరిగిన లంచ్ భేటీలో ఠాగూర్ తో పాటు పలువురు కాంగ్రెస్ నేతలు పాల్గొన్నారు. 

We Will Win In 80 Assembly Seats In 2023 Elections Congress  Telangana Incharge Manickam Tagore

హైదరాబాద్: మిషన్- 2023పై చర్చించినట్టుగా Congress పార్టీ తెలంగాణ రాష్ట్ర వ్యవహారాల ఇంచార్జీ మాణికం ఠాగూర్ చెప్పారు.

ఆదివారం నాడు భువనగిరి ఎంపీ Komatireddy Venkat Reddy  నివాసంలో జరిగిన లంచ్ భేటీకి Manickam Tagore హాజరయ్యారు. ఈ సమావేశం ముగిసిన తర్వాత మాణికం ఠాగూర్  మీడియాతో మాట్లాడారు. పార్టీలో చేరికలతో పాటు చాలా విషయాలపై మాట్లాడినట్టుగా చెప్పారు. కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి తమ పార్టీ నేత, అంతేకాదు పార్లమెంట్ లో తన సహచర ఎంపీ. ఆయన తనను భోజనానికి ఆహ్వానించారు.ఈ భేటీకి హాజరై పలు విషయాలపై చర్చించినట్టుగా ఠాగూర్ చెప్పారు. త్వరలోనే పార్టీలో మరిన్ని చేరికలు ఉంటాయని ఠాగూర్ చెప్పారు. Telangana లో 70 నుండి 80 మంది ఎమ్మెల్యేలను వచ్చే ఎన్నికల్లో గెలుస్తామని ఆయన ధీమాను వ్యక్తం చేశారు.

also read:అసంతృప్తి లేదు, అలా అయితే బిల్యా నాయక్ చేరిక కూడా చెల్లదు: భువనగిరి ఎంపీ కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి

జడ్చర్ల మాజీ ఎమ్మెల్యే Erra Shekar  కాంగ్రెస్ పార్టీలో చేరడాన్ని భువనగిరి ఎంపీ కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి తీవ్రంగా   వ్యతిరేకించారు. ఈ విషయంతో పాటు పలు విషయాలపై ఈ సమావేశంలో చర్చించారని సమాచారం.  రాష్ట్రంలో  ప్రస్తుతం ఉన్న రాజకీయ వాతావరణం రానున్న రోజుల్లో అనుసరించాల్సిన వ్యూహాంపై పార్టీ నేతలు చర్చించారు. అదే విధంగా నేతల మధ్య నెలకొన్న అగాధాలను పరిష్కరించే విషయమై కూడా చర్చించారు.కేసీఆర్ సర్కార్ అనుసరిస్తున్న ప్రజా వ్యతిరేక విధానాలపై ఏ రకమైన వ్యూహంతో ముందుకు వెళ్లాలనే దానిపై కూడా చర్చించారు.మరో వైపు టీఆర్ఎస్ కు రాష్ట్రంలో తామే ప్రత్యామ్నాయం అనే విషయమై కూడా ప్రజల్లో విశ్వాసం కల్పించేందుకు తీసుకోవాల్సిన చర్యలపై కూడా చర్చించారు.

పార్టీలో చేరికల విషయమై ఈ సమావేశంలో భువనగిరి ఎంపీ కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి లేవనెత్తిన అంశాలపై పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇంచార్జీ మాణికం ఠాగూర్ వివరించారు. పార్టీ  ఎన్నికల వ్యూహాకర్తగా ఉన్న సునీల్ ఇస్తున్న సమాచారం మేరకు పార్టీలో చేరికల విషయమై పార్టీ జాతీయ నాయకత్వం గ్రీన్ సిగ్నల్ ఇస్తోంది. రాష్ట్రంలోని పలు అసెంబ్లీ నియోజకవర్గాల్లో కాంగ్రెస్ పార్టీ పరిస్థితి, ఇతర పార్టీల పరిస్థితిపై సునీల్ నేతృత్వంలోని బృందం సమాచారం ఇస్తున్నారు. అంతేకాదు ఆయా నియోజకవర్గాల్లో ఎవరిని పార్టీలో చేర్చుకొంటే పార్టీకి ప్రయోజనంగా ఉంటుందనే విసయమై కూడా సునీట్ టీమ్ ఎఐసీసీకి  ఇస్తుంది.ఈ సమాచారం ఆధారంగా పార్టీలో చేరికలు జరుగుతున్నాయనే విషయమై కూడా ఠాగూర్ వివరించారని సమాచారం.

అయితే పార్టీలో చేరిన వారికి టికెట్లు కేటాయింపు విషయమై వీరి మధ్య చర్చకు వచ్చిందని సమాచారం. అయితే  సర్వేల ఆధారంగా ఏ అభ్యర్ధిని బరిలోకి దింపితే పార్టీ విజయావకాశాలు మెరుగ్గా ఉంటాయనే విషయమై సర్వేలు నిర్వహించనున్నారు. ఈ సర్వేల ఆధారంగా టికెట్లు కేటాయించాలని కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి ఠాగూర్ దృష్టికి తీసుకెళ్లినట్టుగా సమాచారం.ఈ విషయమై ఠాగూర్ కూడా సానుకూలంగా స్పందించారని తెలుస్తుంది. వచ్చే ఎన్నికల్లో తెలంగాణలో కనీసం 80 అసెంబ్లీ స్థానాల్లో గెలవడానికి అనుసరించాల్సిన వ్యూహాంపై చర్చించినట్టు తెలుస్తుంది.

Latest Videos
Follow Us:
Download App:
  • android
  • ios