హైదరాబాద్: పోస్టల్ బ్యాలెట్ ఫలితాలే నిజమౌతాయని బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్ ధీమాను వ్యక్తం చేశారు.

పోస్టల్ బ్యాలెట్లలో జీహెచ్ఎంసీ పరిధిలోని అత్యధిక డివిజన్లలో బీజేపీకి మెజారిటీ ఓట్లు వచ్చాయి.సాధారణ బ్యాలెట్లలో కూడా ప్రజలు బీజేపీకే పట్టం కడుతారని ఆయన విశ్వాసం వ్యక్తం చేశారు.

also read:జాంబాగ్‌ డివిజన్‌లో ఓట్ల గల్లంతు: బీజేపీ నిరసన, అదేమీ లేదన్న అధికారులు

ప్రతి కౌంటింగ్ సెంటర్లలో బీజేపీకే అత్యధిక ఓట్లు వచ్చిన విషయాన్ని ఆయన గుర్తు చేశారు. సాయంత్రానికి బీజేపీకి అనుకూలంగా తీర్పు వస్తోందని ఆయన చెప్పారు.

బీజేపీ అభ్యర్ధి మేయర్ కావాలని ప్రజలు కోరుకొంటున్నారని ఈ ఫలితాలను బట్టి తెలుస్తోందన్నారు. జీహెచ్ఎంసీ ఎన్నికల్లో టీఆర్ఎస్ నేతల  మాటలను ప్రజలు పట్టించుకోలేదని ఆయన అభిప్రాయపడ్డారు.

జీహెచ్ఎంసీ ఎన్నికలను బీజేపీ, టీఆర్ఎస్, కాంగ్రెస్ ప్రతిష్టాత్మకంగా తీసుకొన్నాయి. ఈ ఎన్నికల్లో బల్దియా పఠంపై కాషాయ జెండా ఎగురవేయాలని బీజేపీ ప్లాన్ చేసింది. బీజేపీ అగ్రనేతలంతా హైద్రాబాద్ లో ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు.