హైదరాబాద్: జీహెచ్ఎంసీ కౌంటింగ్ లో గోషామహల్ నియోజకవర్గంలో ఓట్లు గల్లంతయ్యాయని ఆరోపిస్తూ బీజేపీ నేతలు శుక్రవారం నాడు ఆందోళనకు దిగారు.

గోషామమహాల్ నియోజకవర్గంలోని జాంబాగ్ డివిజన్ లోని పోలింగ్ బూత్ నెంబర్ లో 8లో ఓట్లు గల్లంతయ్యాయని బీజేపీ ఆరోపిస్తోంది. ఈ  పోలింగ్ బూత్ లో 471 ఓట్లకు గాను 257 ఓట్లు మాత్రమే ఉన్నాయి. మిగిలిన ఓట్లు గల్లంతయ్యాయని బీజేపీ కార్యకర్తలు ఆందోళనకు దిగారు.

also read:జీహెచ్ఎంసీ ఓట్ల లెక్కింపు: సనత్‌నగర్, ఓయూ సెంటర్ల వద్ద ఉద్యోగుల నిరసన

ఓట్లు గల్లంతు కాలేదని పోలింగ్ అధికారులు ప్రకటించారు. తాము తప్పుగా పోలింగ్ శాతాన్ని చెప్పినట్టుగా అధికారులు తెలిపారు. ఓట్లు గల్లంతయ్యాయనే బీజేపీ ఆరోపణలో వాస్తవం లేదని అధికారులు ప్రకటించారు.

జాంబాగ్ డివిజన్ లో ఓట్లు గల్లంతయ్యాయని.. ఇందుకు బాధ్యులైన అధికారులపై చర్యలు తీసుకోవాలని బీజేపీ ఆందోళనకు దిగింది.పోలింగ్ శాతం ఎలా తప్పు చెబుతారని బీజేపీ నేతలు ప్రశ్నిస్తున్నారు. ఓట్లు గల్లంతు  చేసి.. ఇప్పుడు పోలింగ్ శాతం తప్పు చెప్పామని అధికారులు తమను తప్పుదోవ పట్టిస్తున్నారని బీజేపీ నేతలు ఆరోపిస్తున్నారు.