Asianet News TeluguAsianet News Telugu

అధికారంలోకి వచ్చిన 100 రోజుల్లో ధరణి సమస్యలు పరిష్కరిస్తాం: రేవంత్ రెడ్డి

ధరణి పోర్టల్  కారణంగా  గ్రామాల్లో సమస్యలు నెలకొంటున్నాయని  టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి ఆరోపించారు. తమ పార్టీ అధికారంలోకి రాగానే ధరణిని రద్దు  చేస్తామన్నారు. 

We Will Resolve  Dharani Portal  Problems  Within 100 days After  Getting  power:Revanth Reddy
Author
First Published Mar 10, 2023, 2:51 PM IST


కరీంనగర్ :కాంగ్రెస్ అధికారంలోకి రాగానే 100 రోజుల్లో ధరణి సమస్యలను పరిష్కరిస్తామని టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి  ప్రకటించారు. అంతేకాదు   ధరణి పోర్టల్ రద్దు  చేస్తామని ఆయన పునరుద్ఘాటించారు.

పాదయాత్రలో భాగంగా  ఉమ్మడి కరీంనగర్  జిల్లాలో  రేవంత్ రెడ్డి పాదయాత్ర  కొనసాగుతుంది. ఈ పాదయాత్ర సందర్భంగా  ప్రజల సమస్యలను తెలుసుకున్నారు. ఈ సందర్భంగా  ఆయన ప్రసంగించారు.

 తెలంగాణలో జరిగిన పోరాటాలకు మూలం భూమి అని ఆయన గుర్తు  చేశారు. 
భూమి పేదవాడి ఆత్మగౌరవం, జీవనవిధానంగా ఆయన పేర్కొన్నారు.  కాంగ్రెస్ హయాంలో సరళీకృత విధానాలు తెచ్చి పేదలకు భూమిని పంపిణీ చేసిందన్నారు.  22లక్షల ఎకరాల భూములను కాంగ్రెస్ పేదలకు పంచిందని ఆయన గుర్తు చేశారు.కేసీఆర్ తెచ్చిన ధరణితో గ్రామాల్లో 200 సమస్యలు  ఉత్పన్నమయ్యాయన్నారు. ధనవంతుల కోసమే కేసీఆర్ ధరణి పోర్టల్ తీసుకొచ్చారని ఆయన విమర్శించారు. 

ధరణితో పేదల నుంచి వేలాది కోట్లు దోచుకుంటున్నారని  రేవంత్ రెడ్డి ఆరోపించారు. ధరణి పోర్టల్ తో వేల కోట్లు కేసీఆర్ బంధువుల చేతుల్లోకి వెళ్లాయన్నారు.  పేదల భూములను ఆక్రమించుకున్నవారిని జైల్లో పెట్టాలని  ఆయన డిమాండ్  చేశారు. పేదలకు భూములు పంచి వారి ఆత్మగౌరవం నిలబెట్టాలని ఆయన కోరారు. రాష్ట్రంలో 9 లక్షల మంది ధరణితో సమస్యలు ఎదుర్కొంటున్నారని  రేవంత్ రెడ్డి  చెప్పారు. ఇప్పటికైనా కేసీఆర్ ధరణి విధానంలో లోపాలను సరి చేయాలని ఆయన డిమాండ్  చేశారు.  లేకపోతే పేదల ఉసురు తగిలి మట్టి కొట్టుకుపోతారని రేవంత్ రెడ్డి విమర్శించారు..

also read:బీఆర్ఎస్ మోడ‌ల్ అంటే కుంటుంబ పాల‌న‌.. గుజ‌రాత్ మోడల్ తో క్రోనీ క్యాపిటలిస్టులకు ల‌బ్ది.. : కాంగ్రెస్

2006లో అటవీ హక్కుల చట్టం తెచ్చి ఆదివాసీ, గిరిజనులకు 10లక్షల ఎకరాలు  కాంగ్రెస్ పార్టీ పంపిణీ చేసిందన్నారు. 2013 భూసేకరణ చట్టం తెచ్చి పేదలను ఆదుకుంది కాంగ్రెస్ పార్టీయేనని ఆయన గుర్తు  చేశారు. ఈ చట్టాలు రూపకల్పనలో  జైరాం రమేశ్ కీలకపాత్ర పోషించినట్టుగా  ఆయన  తెలిపారు. కేసీఆర్, మోడీ కలిసి భూసేకరణ చట్టానికి తూట్లు పొడిచారని రేవంత్ రెడ్డి విమర్శించారు.  

 

Follow Us:
Download App:
  • android
  • ios