ఇంటర్ పరీక్ష ఫలితాలను విడుదల చేసేందుకు ఇంటర్మీడియట్ బోర్డు కసరత్తు చేస్తోంది.  ఇంటర్ ఫస్టియర్ తో పాటు సెకండియర్ పరీక్షలను కూడ ప్రభుత్వం రద్దు చేస్తూ నిర్ణయం తీసుకొంది.

హైదరాబాద్: ఇంటర్ పరీక్ష ఫలితాలను విడుదల చేసేందుకు ఇంటర్మీడియట్ బోర్డు కసరత్తు చేస్తోంది. ఇంటర్ ఫస్టియర్ తో పాటు సెకండియర్ పరీక్షలను కూడ ప్రభుత్వం రద్దు చేస్తూ నిర్ణయం తీసుకొంది.ఫస్టియర్, సెకండియర్ విద్యార్థులకు మార్కులను కేటాయించే విషయమై కమిటీని ఏర్పాటు చేసింది ప్రభుత్వం. ఈ కమిటీ రిపోర్టు ఆధారంగా విద్యార్థులకు మార్కుల కేటాయింపు జరగనుంది. ఇంటర్ సెకండియర్ పరీక్షలను రద్దు చేస్తూ వారం రోజుల క్రితం ప్రభుత్వం నిర్ణయం తీసుకొంది. రాష్ట్రంలోని 4,73,967 మంది విద్యార్థులు ఉత్తీర్ణులయ్యారు.ఫస్టియర్ లో ఫెయిలైన విద్యార్థులకు కనీస మార్కులను కేటాయించాలని నిర్ణయం తీసుకొన్నారు. 

also read:తెలంగాణలో ఇంటర్ సెకండియర్ పరీక్షలు రద్దు: సబిత అధికారిక ప్రకటన

మరో వారంలో ఇంటర్‌ ఫలితాలు విడుదల చేస్తామని ఇంటర్‌ బోర్డు కార్యదర్శి ఉమర్‌ జలీల్‌ వెల్లడించారు. మంగళవారం ఆయన మీడియాతో మాట్లాడారు. జులై 1 నుంచి ఇంటర్ సెకండ్ ఇయర్‌ విద్యార్థులకు ఆన్‌లైన్ క్లాసులు నిర్వహిస్తామని తెలిపారు. జులై మధ్యలో ఫస్ట్‌ ఇయర్ క్లాసులు నిర్వహిస్తామని పేర్కొన్నారు. విద్యా సంవత్సరం ప్రారంభం కాకముందే ఫీజులు వసూలు చేస్తే కఠిన చర్యలు తీసుకుంటామని ఆయన హెచ్చరించారు.