Asianet News TeluguAsianet News Telugu

డోర్‌ టూ డోర్ సర్వే చేస్తాం: కులగణనపై అసెంబ్లీలో రేవంత్ రెడ్డి

గత ప్రభుత్వం ప్రజలకు ఇచ్చిన హామీల అమలు విషయంలో ఏం చేసిందో... అధికారంలోకి వచ్చిన తర్వాత తాము ఏం చేశామో చర్చించేందుకు  సిద్దమని  తెలంగాణ సీఎం అనుముల రేవంత్ రెడ్డి  చెప్పారు.

We will door to Door Survey on caste Census   says Telangana CM Revanth Reddy lns
Author
First Published Feb 16, 2024, 2:26 PM IST | Last Updated Feb 16, 2024, 2:26 PM IST


హైదరాబాద్:బలహీనవర్గాలను బలోపేతం చేయడమే తమ ప్రభుత్వ లక్ష్యమని తెలంగాణ ముఖ్యమంత్రి అనుముల రేవంత్ రెడ్డి  చెప్పారు.
 కుల గణనపై  తెలంగాణ ప్రభుత్వం శుక్రవారం నాడు అసెంబ్లీలో  తీర్మానాన్ని ప్రవేశ పెట్టింది.  మంత్రి పొన్నం ప్రభాకర్ ఈ తీర్మానాన్ని ప్రవేశ పెట్టారు.ఈ తీర్మానంపై  తెలంగాణ ముఖ్యమంత్రి అనుముల రేవంత్ రెడ్డి  మాట్లాడారు. బలహీనవర్గాలను బలోపేతం చేయడమే తమ ప్రభుత్వ ఉద్దేశ్యమని సీఎం రేవంత్ రెడ్డి తెలిపారు.

మీరు సమగ్ర కుటుంబ సర్వే చేశామని గొప్పగా చెప్పుకున్నారు.ఆ వివరాలను  ఎందుకు బయటపెట్టలేదని సీఎం రేవంత్ రెడ్డి ప్రశ్నించారు. ఎప్పుడైనా ఆ వివరాలను  సభలో పెట్టారా అని సీఎం అడిగారుఎన్నికలప్పుడు మాత్రమే ఆ వివరాలను  మీరు వాడుకుంటున్నారని సీఎం విమర్శించారు. కుల గణనపై  తీర్మానాన్ని  ప్రభుత్వమే ప్రవేశ పెట్టిన విషయాన్ని ఆయన గుర్తు చేశారు. 

కుల గణనపై రాష్ట్రంలో అన్ని వర్గాలను సర్వే చేస్తామని ఆయన చెప్పారు.డోర్ టూ డోర్ సర్వే  చేస్తామన్నారు.ఈ వివరాలను ఆ తర్వాత సభలో పెడతామన్నారు. ప్రతి విషయాన్ని రాజకీయం చేయాలని  చూస్తుందని  ఆయన విపక్షంపై మండిపడ్డారు. సభను తప్పుదోవ పట్టించేందుకు  ప్రభుత్వం ప్రయత్నిస్తుందని  రేవంత్ రెడ్డి విమర్శించారు.మీరు పదేళ్లు ఏం చేశారు. ...మేం 60 రోజులు ఏం చేశామనేది చర్చించడానికి సిద్దంగా ఉన్నామని రేవంత్ రెడ్డి చెప్పారు. 

ఇవాళ ఉదయం అసెంబ్లీలో ఈ తీర్మానాన్ని మంత్రి పొన్నం ప్రభాకర్ ప్రవేశ పెట్టారు.ఈ తీర్మానానికి బీఆర్ఎస్ మద్దతు ఇచ్చింది.  ఈ విషయమై  చర్చలో ఆ పార్టీ పాల్గొంది.  బీజేపీ తరపున ఆ పార్టీ శాసనసభపక్ష ఉప నాయకుడు పాయల్ శంకర్ ఈ చర్చలో పాల్గొన్నారు. 

ఎన్నికల సమయంలో  కులగణన చేయనున్నట్టుగా కాంగ్రెస్ పార్టీ హామీ ఇచ్చింది. ఈ క్రమంలోనే  కుల గణనపై  సర్వే కోసం  అసెంబ్లీ తీర్మానాన్ని ఇవాళ రేవంత్ రెడ్డి సర్కార్ ప్రవేశ పెట్టింది.  


 

Latest Videos
Follow Us:
Download App:
  • android
  • ios