డిగ్రీ, పీజీ పరీక్ష తేదీలను త్వరలో ప్రకటిస్తాం: హైకోర్టులో తెలంగాణ సర్కార్
డీగ్రీ, పీజీ పరీక్షలు రద్దు చేయడం కుదదరని తెలంగాణ ప్రభుత్వం హైకోర్టుకు తెలిపింది.డీగ్రీ, పీజీ పరీక్షలు వాయిదా వేయాలని ఎన్ఎస్‌యూఐ రాష్ట్ర ఉపాధ్యక్షుడు వెంకట్ దాఖలు చేసిన పిటిషన్ పై గురువారం నాడు హైకోర్టు విచారించింది.
హైదరాబాద్: డీగ్రీ, పీజీ పరీక్షలు రద్దు చేయడం కుదదరని తెలంగాణ ప్రభుత్వం హైకోర్టుకు తెలిపింది.డీగ్రీ, పీజీ పరీక్షలు వాయిదా వేయాలని ఎన్ఎస్‌యూఐ రాష్ట్ర ఉపాధ్యక్షుడు వెంకట్ దాఖలు చేసిన పిటిషన్ పై గురువారం నాడు హైకోర్టు విచారించింది.
యూజీసీ నిబంధనల ప్రకారంగా పరీక్షలు నిర్వహిస్తామని ప్రభుత్వం హైకోర్టుకు తెలిపింది. యూజీసీ మార్గదర్శకాల మేరకు పరీక్షలు రద్దు చేయడం కుదరదని రాష్ట్ర ప్రభుత్వం హైకోర్టుకు స్పష్టం చేసింది.
రెండు మూడు రోజుల తర్వాత పరీక్ష తేదీలను ప్రకటిస్తామని ప్రభుత్వం హైకోర్టుకు తేల్చి చెప్పింది. అయితే ఇంటర్నల్ మార్కుల ఆధారంగా విద్యార్థులకు గ్రేడింగ్ ఇవ్వాలని పిటిషనర్ తరపు న్యాయవాది దామోదర్ రెడ్డి వాదించారు.
also read:తెలంగాణలో ఎంసెట్ సహా ప్రవేశ పరీక్షలన్నీ వాయిదా
యూజీసీ మార్గదర్శకాలు కేవలం సూచనలు మాత్రమేనని ఆయన అభిప్రాయపడ్డారు. దేశంలోని ఏడెనిమిది రాష్ట్రాల్లో పరీక్షలు రద్దు చేసినట్టుగా పిటిషనర్ గుర్తు చేశారు. ఈ విషయమై మూడు వారాల్లో కౌంటర్ దాఖలు చేయాలని హైకోర్టు రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆదేశించింది.
కరోానాను పురస్కరించుకొని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం టెన్త్ పరీక్షలను రద్దు చేసింది. పలు ప్రవేశ పరీక్షలను రద్దు చేసింది సర్కార్. దీంతో డిగ్రీ, పీజీ పరీక్షలను కూడ వాయిదా వేయాలని వెంకట్ పిటిషన్ దాఖలు చేశారు.