Asianet News TeluguAsianet News Telugu

సుప్రీం తీర్పు ప్రకారం నడుస్తాం: వినాయక విగ్రహల నిమజ్జనంపై మంత్రి తలసాని


గణేష్ నిమజ్జనంపై  సుప్రీంకోర్టు ఆదేశాల ప్రకారం తాము నడుచుకొంటామని తెలంగాణ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ స్పష్టం చేశారు.హుస్సేన్ సాగర్ లో వినాయక విగ్రహల నిమజ్జనంపై తెలంగాణ ప్రభుత్వం సుప్రీంలో పిటిషన్ దాఖలు చేసింది.

We will act supreme court verdict on Vinayaka idol immersion :talanasani Srinivas Yadav
Author
Hyderabad, First Published Sep 14, 2021, 2:17 PM IST

హైదరాబాద్: గణేష్ నిమజ్జంపై సుప్రీంకోర్టు ఆదేశాల ప్రకారం నడుచుకుంటామని  తెలంగాణ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ స్పష్టం చేశారు. గణేష్ నిమజ్జనంపై హైకోర్టు ఇచ్చిన తీర్పుపై సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేసినట్టు చెప్పారు.మరొక  రెండు రోజుల్లో  తీర్పు వచ్చే అవకాశం ఉందని  మంత్రి లిపారు  తీర్పు వచ్చే అవకాశం ఉందని తెలిపారు. హైకోర్టు తీర్పును గౌరవిస్తూ ప్రత్యామ్నాయ ఏర్పాట్లు సైతం చేస్తున్నామన్నారు.  ట్యాంక్ బండ్ సహా  గ్రేటర్ పరిధిలో అనేక లేక్స్‌లో నిమజ్జనం ఏర్పాట్లు చేశామని చెప్పారు.

also read:హుస్సేన్‌సాగర్‌లో వినాయక విగ్రహల నిమజ్జనం: సుప్రీంలో తెలంగాణ సర్కార్ పిటిషన్

 హుస్సేన్ సాగర్‌లో ఖచ్చితంగా నిమజ్జనం చేస్తామనటం భాగ్యనగర్ గణేష్ ఉత్సవ సమితి అభిప్రాయం మాత్రమే అని అన్నారు. వాళ్ళ అభిప్రాయంపై ప్రభుత్వం వెంటనే స్పందించాల్సిన అవసరం లేదని స్పష్టం చేశారు. గణేష్ చతుర్థికి దేశంలోనే హైదరాబాద్‌ది ప్రత్యేక స్థానమన్నారు. అందుకు తగిన ఏర్పాట్లు తెలంగాణ ప్రభుత్వం చేసిందని మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ తెలిపారు. 

Follow Us:
Download App:
  • android
  • ios