Asianet News TeluguAsianet News Telugu

కేంద్ర విద్యుత్ సవరణ బిల్లును వ్యతిరేకిస్తున్నాం: అసెంబ్లీలో భట్టి

కేంద్ర విద్యుత్ సవరణ బిల్లును వ్యతిరేకిస్తున్నట్టుగా సీఎల్పీ నేత మల్లు భట్టి విక్రమార్క చెప్పారు. ఇవాళ తెలంగాణ అసెంబ్లీలో కేంద్ర విద్యుత్ సవరణ బిల్లు 2022 పై జరిగిన స్వల్పకాలిక చర్చలో ఆయన పాల్గొన్నారు.

We opposes union electricity amendment bill 2022: Clp leader Mallu Bhatti Vikramarka
Author
First Published Sep 12, 2022, 2:24 PM IST

హైదరాబాద్:కేంద్ర విద్యుత్ సవరణ బిల్లును తీవ్రంగా వ్యతిరేకిస్తున్నామని సీఎల్పీ నేత మల్లు భట్టి విక్రమార్క చెప్పారు.ఈ విషయమై అందరితో కలిసి ఉద్యమం చేసేందుకు తాము సిద్దంగా ఉన్నామని మల్లు భట్టి విక్రమార్క తెలిపారు.

సోమవారం నాడు తెలంగాణ అసెంబ్లీలో జరిగిన కేంద్ర విద్యుత్ సవరణ బిల్లు 2022 పై  జరిగిన స్వల్ప కాలిక చర్చలో సీఎల్పీ నేత మల్లుభట్టి విక్రమార్క పాల్గొన్నారు. తెలంగాణ అసెంబ్లీలో గతంలోనే ఈ విషయమై అసెంబ్లీ తీర్మానం చేసిన విషయాన్ని ఆయన గుర్తు చేశారు.  కేంద్ర విద్యుత్ చట్టంతో పాటుఇతర అంశాలపై కూడ సభలో చర్చించాల్సిన అవసరం ఉందని ఆయన అభిప్రాయపడ్డారు. ప్రజా సమస్యలపై చర్చలకు వేరే వేదిక లేదని భట్టి విక్రమార్క చెప్పారు. ఆకస్మాత్తుగా ప్రశ్నోత్తరాలను బంద్ చేయడమేమిటని ఆయన ప్రశ్నించారు. ప్రజల సమస్యలపై చర్చకు అసెంబ్లీలో సమయం ఇవ్వాలని భట్టి విక్రమార్క కోరారు.

also read:జాతీయ పార్టీని ఎందుకు పెట్టొద్దు: తెలంగాణ అసెంబ్లీలో కేసీఆర్
రాష్ట్రంలోని పలు హాస్టల్స్, గురుకుల పాఠశాలల్లో విద్యార్ధులకు సరైన భోజన సౌకర్యం లేదన్నారు. భోజనం సరిగా లేక విద్యార్ధులు అస్వస్థతకు గురౌతున్నారన్నారు. ఈ విషయమై చర్చించాలని ఆయన కోరారు.  కానిస్టేబుల్ అభ్యర్ధుల కటాఫ్  విషయమై అన్ని సామాజిక వర్గాలకు మినహయింపు ఇచ్చినట్టుగా దళిత అభ్యర్ధులకు మినహాయింపు ఇవ్వాలని భట్టి విక్రమార్క కోరారు.ఆ తర్వాత కేసీఆర్ తన ప్రసంగంలో ఈ భట్టి లేవనెత్తిన అంశాలను సమాధానమిచ్చారు. కానిస్టేబుల్ అభ్యర్ధులకు కూడా కటాఫ్ మార్కుల విషయంలో మినహయింపు ఇస్తామని ప్రకటించారు.

 

Follow Us:
Download App:
  • android
  • ios