ఫైర్ సేఫ్టీ పరికరాలతో వెళ్లే సరికి మంటల వ్యాప్తి: ఫలక్‌నుమా లోకో పైలెట్

ఎవరో ప్రయాణీకుడు  చైన్ లాగడంతో రైలును నిలిపివేసినట్టుగా  ఫలక్ నుమా  ఎక్స్ ప్రెస్ రైలు  పైలెట్ తెలిపారు. పొగలు వ్యాపించిన బోగీ వద్దకు  తాము వెళ్లే సరికి మంటలు వ్యాపించినట్టుగా ఆయన  చెప్పారు. 

We dont know how spread  fire in  falaknuma train, says loco pilot lns

హైదరాబాద్:  చైన్ లాగిన విషయం తమ దృష్టికి రావడంతో  రైలును వెంటనే నిలిపివేసినట్టుగా  ఫలక్ నుమా ఎక్స్ ప్రెస్ రైలు  పైలెట్  చెప్పారు.
భువనగిరికి సమీపంలోని పగిడిపల్లి సమీపంలో  పలక్ నుమా  రైలులో  శుక్రవారం నాడు అగ్ని ప్రమాదం జరిగింది.

ఈ అగ్ని ప్రమాదం జరిగిన తర్వాత  ఓ ప్రయాణీకుడు  చైన్ లాగాడు.ఈ విషయం తమకు  తెలియగానే  వెంటనే  అసిస్టెంట్ లోకో పైలెట్ ను  ఏం జరిగిందో తెలుసుకునేందుకు  పంపినట్టుగా పైలెట్ మీడియాకు  చెప్పారు.

రైలు బోగీల్లో  పొగ వ్యాపించిన విషయాన్ని అసిస్టెంట్ లోకో పైలెట్ తన దృష్టికి తీసుకువచ్చారని పైలెట్ చెప్పారు.  తమ వద్ద ఫైర్ సేఫ్టీ  పరికరాలతో పొగలు వ్యాపించిన   బోగీల వద్దకు  చేరుకొనే  సమయానికి మంటలు పూర్తిగా వ్యాప్తి చెందాయన్నారు.  

also read:ఫలక్ ‌నుమా ఎక్స్ ప్రెస్ అగ్ని ప్రమాదంపై విచారణ: ఎస్‌సీఆర్ జీఎం అరుణ్

ఈ విషయాన్ని రైల్వే గార్డుకు  సమాచారం ఇచ్చినట్టుగా లోకో పైలెట్ చెప్పారు.  మంటలు వ్యాపించిన  బోగీలను , ఇతర బోగీలతో లింక్ ను  తొలగించినట్టుగా  పైలెట్ చెప్పారు.   సికింద్రాబాద్ రైల్వే శాఖ ఉన్నతాధికారుల  నుండి సమాచారం రాగానే  మిగిలిన బోగీలతో  ఫలక్ నుమా రైలుతో  సికింద్రాబాద్ కు  చేరుకున్నట్టుగా  పైలెట్ చెప్పారు.
 

Latest Videos
Follow Us:
Download App:
  • android
  • ios