మేం చంద్రబాబు ట్రాప్ లో పడలేదు: కేసీఆర్

We didn’t step into TDP trap, says KCR
Highlights

కేంద్ర ప్రభుత్వంపై ఎపి ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ప్రతిపాదించిన అవిశ్వాస తీర్మానం విషయంలో తాము తీసుకున్న వైఖరిని తెలంగాణ ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర రావు గవర్నర్ నరసింహన్ కు వివరించారు.

హైదరాబాద్: కేంద్ర ప్రభుత్వంపై ఎపి ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ప్రతిపాదించిన అవిశ్వాస తీర్మానం విషయంలో తాము తీసుకున్న వైఖరిని తెలంగాణ ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర రావు గవర్నర్ నరసింహన్ కు వివరించారు. ఆయన ఆదివారంనాడు గవర్నర్ ను కలిసి ఆ విషయం చెప్పారు.

తాము టీడీపి ట్రాప్ లో పడలేదని స్పష్టం చేశారు. అవిశ్వాస తీర్మానంపై ఓటింగుకు దూరంగా ఉండడం ద్వారా నరేంద్ర మోడీ ప్రభుత్వానికి, ప్రతిపక్ష కాంగ్రెసుకు సమాన దూరం పాటించామని ఆయన చెప్పారు. 

జాతీయ స్థాయిలో బిజెపికి, కాంగ్రెసుకు వ్యతిరేకంగా ఫెడరల్ ఫ్రంట్ ఏర్పాటు చేయాలనే ఆలోచనలో భాగంగానే తాము అవిశ్వాస తీర్మానంపై ఆ విధమైన వైఖరి తీసుకున్నట్లు చెబుతున్నారు  ఆ విషయంపై తెలంగాణ ప్రజలకు స్పష్టమైన సంకేతాలు ఇవ్వాలని ఆయన అనుకుని ఆ విధమైన వైఖరి తీసుకున్నట్లు చెబుతున్నారు.

అవిశ్వాసంపై చర్చను తాము తెలంగాణ అభివృద్ధికి, విభజన చట్టంలో ఇచ్చిన హామీల అమలుకు సంబంధించిన అంశాలను ఎత్తిచూపడానికి వాడుకున్నట్లు కేసీఆర్ గవర్నర్ కు చెప్పారు. 

loader