హైదరాబాద్:  శాంతి భద్రతలకు విఘాతం కల్గిస్తే ఉక్కుపాదంతో అణచివేస్తామని తెలంగాణ మంత్రి కేటీఆర్ చెప్పారు.

గురువారం నాడు హైద్రాబాద్ సోమాజీగూడలో నిర్వహించిన మీట్ ది ప్రెస్ కార్యక్రమంలో ఆయన మాట్లాడారు.  రాష్ట్రంలో కొందరు మతసామరస్యాన్ని దెబ్బతీసే ప్రయత్నం చేస్తున్నారని ఆయన ఆరోపించారు. 

హైద్రాబాద్ బ్రాండ్ ఇమేజ్ ను దెబ్బతీసేవారి పట్ల కఠినంగా వ్యవహరిస్తామని ఆయన తేల్చి చెప్పారు. తెలంగాణ రాష్ట్రంలో అన్ని మతాల ప్రజలు సోదరభావంతో జీవిస్తున్నారన్నారు.

also read:6 ఏళ్ల క్రితం మాపై దుష్ప్రచారం, కానీ.. ఇవాళ దేశం మా వైపు చూస్తోంది: కేటీఆర్

ఈ సమయంలో కొందరు మత విద్వేషాలు రెచ్చగొట్టే ప్రయత్నం చేస్తున్నారని ఆయన ఆరోపించారు. అందరి హైద్రాబాద్ కావాలో... కొందరి హైద్రాబాద్ కావాలో ఆలోచించాలని ఆయన కోరారు.

తమ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత రాష్ట్రంలో బాంబు పేలుళ్లు, మతకల్లోలాలు, అల్లర్లు, కర్ఫ్యూ లేవని ఆయన చెప్పారు.ప్రజల మధ్య చిచ్చు పెట్టి లబ్ది పొందే ప్రయత్నం చేస్తే చూస్తూ ఊరుకోబోమని ఆయన తెలిపారు.