టెన్త్ పరీక్షల నిర్వహణకు సిద్దం: తెలంగాణ హైకోర్టుకు తెలిపిన ప్రభుత్వం

పదో తరగతి పరీక్షల నిర్వహణకు సంబంధించి జిల్లాల వారీగా  చేసిన ఏర్పాట్లపై ప్రభుత్వం తెలంగాణ హైకోర్టుకు నివేదించింది. టెన్త్ పరీక్షల నిర్వహణ విషయమై గురువారం నాడు హైకోర్టు ఇవాళ విచారణ చేసింది.

We are ready to conduct tenth exams telangana government says to high court

హైదరాబాద్: పదో తరగతి పరీక్షల నిర్వహణకు సంబంధించి జిల్లాల వారీగా  చేసిన ఏర్పాట్లపై ప్రభుత్వం తెలంగాణ హైకోర్టుకు నివేదించింది. టెన్త్ పరీక్షల నిర్వహణ విషయమై గురువారం నాడు హైకోర్టు ఇవాళ విచారణ చేసింది.

రాష్ట్రంలో పదో తరగతి పరీక్షల నిర్వహణ విషయమై ప్రభుత్వం ఈ నెల 3వ తేదీన హైకోర్టుకు నివేదిక అందించింది. ఈ నివేదికలో పరీక్షల నిర్వహణకే ప్రభుత్వం సానుకూలంగా ఉన్నట్టుగా తెలిపింది.

also read:టెన్త్ పరీక్షలకే మొగ్గు: తెలంగాణ హైకోర్టుకు రాష్ట్ర ప్రభుత్వ నివేదిక

రాష్ట్రంలో కరోనా కేసులు రోజు రోజుకు పెరుగుతున్నాయి. కరోనా కేసులు పెరుగుతున్నప్పటికీ కూడ  టెన్త్ పరీక్షలు నిర్వహణకు తాము సిద్దంగా ఉన్నామని ప్రభుత్వం ప్రకటించింది.

జిల్లాల వారీగా టెన్త్ పరీక్షల నిర్వహణకు సంబంధించి చేసిన ఏర్పాట్లను కూడ హైకోర్టుకు తెలిపింది తెలంగాణ ప్రభుత్వం.పరీక్షల నిర్వహణకు  ప్రభుత్వం సిద్దంగా ఉన్న విషయాన్ని అడ్వకేట్ జనరల్ హైకోర్టుకు తెలిపారు. 

We are ready to conduct tenth exams telangana government says to high court

జూన్ మొదటివారంలో టెన్త్ పరీక్షలు నిర్వహణకు తెలంగాణ హైకోర్టు  ఈ ఏడాది మే 22వ తేదీన గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. అయితే జూన్ 3వ తేదీన కరోనా కేసుల విషయమై సమీక్ష నిర్వహించిన తర్వాత అనుమతి ఇస్తామని హైకోర్టు ఆ రోజున స్పష్టం చేసింది. జూన్ 3న రాష్ట్రంలో నివేదిక ఇవ్వాలని కోరింది. దీంతో బుధవారం నాడు హైకోర్టుకు ప్రభుత్వం నివేదికను ఇచ్చింది.

గత నెలలో పరీక్షల నిర్వహణకు సంబంధించి హైకోర్టు గ్రీన్ సిగ్నల్ ఇవ్వడంతో ఈ నెల 8వ తేదీ నుండి జూలై 5వ తేదీ వరకు పరీక్షల షెడ్యూల్ ను ప్రభుత్వం ప్రకటించిన విషయం తెలిసిందే. టెన్త్ పరీక్షల నిర్వహణ విషయంలో ఈ నెల 5వ తేదీన తెలంగాణ హైకోర్టు విచారణను వాయిదా వేసింది. 


 

Latest Videos
Follow Us:
Download App:
  • android
  • ios