హైదరాబాద్: కరోనా మహమ్మారిని తరిమి కొట్టేందుకు ప్రధాని నరేంద్ర మోదీ ముమ్మర చర్యలు ప్రారంభించారు. అందులోభాగంగా మహమ్మారి వైరస్ ను తరిమికొట్టేందుకు వ్యాక్సిన్ తయారుచేస్తున్న సంస్థలను ప్రధాని శనివారం సందర్శించారు. అందులో భాగంగానే హైదరాబాద్ జీనోమ్ వ్యాలీలోని భారత్ బయోటెక్ ను కూడా ప్రధాని సందర్శించారు. ఇలా ప్రధాని తమ సంస్ధను ప్రత్యేకంగా సందర్శించడం ఎంతో  గర్వకారణమని భారత్ బయోటెక్ ప్రకటించింది. 

''కరోనా వ్యాక్సిన్ తయారీలో తాము లీడర్లమని ప్రధాని పర్యటనతో మరోసారి నిరూపితమయ్యింది. ఈ గుర్తింపును తామెంతో గర్వకారణంగా భావిస్తున్నాం. ప్రధాని మోదీ పర్యటన తమ సిబ్బందికి ఎంతో ఆత్మవిశ్వాసాన్ని నింపింది. ఇది ఇకపై జరిపై పబ్లిక్ హెల్త్ ప్రాబ్లమ్స్ ను పరిష్కరించడంలో, శాస్త్రీయ పరిశోదనల్లో మరియు కరోనా మహమ్మారిని తరిమికొట్టడంతో సహాయ పడుతుంది'' అని భారత్ బయోటెక్ అభిప్రాయపడింది. 

read more  భారత్ బయోటెక్ కరోనా వ్యాక్సిన్ వేగవంతం: ప్రధాని మోడీ

''కోవాక్సిన్ మూడో దశ క్లినికల్ ట్రయల్స్ కొనసాగుతున్నాయి. ఈ వ్యాక్సిన్ క్లినికల్ ట్రయల్ ప్రపంచంలోనే మొట్టమొదటిది, అతిపెద్దది మరియు ఖచ్చితమైనది. ఈ క్లినికల్ ట్రయల్ లో 25 నగరాల నుండి భారీ సంఖ్యలో వాలంటీర్లు పాల్గొంటున్నారు. కోవాక్సిన్ మూడో దశ క్లినికల్ ట్రయల్ లో కేవలం ఇండియా నుండే 26వేల మంది పాల్గొంటున్నారు'' అని  తెలిపింది. 

''వ్యాక్సిన్ తయారీలో మాకు అన్ని విధాలుగా సహకరిస్తున్న భారత ప్రభుత్వానికి ధన్యవాదాలు. రెగ్యులేటర్స్, వ్యాక్సిన్ డెవలప్ మెంట్ పార్టనర్స్, మెడికల్ ఫ్రాటెర్నిటీ, మెడికల్ ఇన్వెస్టిగేటర్స్ మరియు హాస్పిటల్స్ వ్యాక్సిన్ తయారీలో ఎంతగానో సమకరించాయి. వాటన్నింటికి కృతజ్ఞతలు'' అని భారత్ బయోటెక్ తెలిపింది.