కేంద్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వస్తే  తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ సమస్యలను పరిష్కరిస్తామని  కాంగ్రెస్ పార్టీ చీఫ్ రాహుల్ గాంధీ హమీ ఇచ్చారు. మోడీ, కేసీఆర్ ఇద్దరూ కూడ అబద్దపు హమీలిచ్చి పబ్బం గడుపుకొంటున్నారని రాహుల్ విమర్శలు చేశారు. 

హైదరాబాద్:కేంద్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వస్తే తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ సమస్యలను పరిష్కరిస్తామని కాంగ్రెస్ పార్టీ చీఫ్ రాహుల్ గాంధీ హమీ ఇచ్చారు. మోడీ, కేసీఆర్ ఇద్దరూ కూడ అబద్దపు హమీలిచ్చి పబ్బం గడుపుకొంటున్నారని రాహుల్ విమర్శలు చేశారు. 

శేరిలింగంపల్లి నియోజకవర్గంలో సోమవారం నాడు జరిగిన కాంగ్రెస్ పార్టీ సభలో కాంగ్రెస్ పార్టీ చీఫ్ రాహుల్ గాంధీ ప్రసంగించారు. 

నాలుగేళ్లుగా కేంద్రంలో ఎన్డీఏ ప్రభుత్వం, తెలంగాణలో టీఆర్ఎస్ ప్రభుత్వం ఉందన్నారు. ఇద్దరీ స్టైల్ ఒకటేనని రాహుల్ గాంధీ చెప్పారు. మోడీ ప్రతి ఒక్కరికీ రూ.15 లక్షల ఖాతాలో వేస్తామన్నారు. తెలంగాణలో కేసీఆర్ డబుల్ బెడ్ రూమ్ ఇళ్లను నిర్మిస్తామని చెప్పారు.ప్రజలను మోసం చేయడంలో ఇద్దరూ ఇద్దరేనని రాహుల్ విమర్శించారు. 

రాఫెల్ ఒప్పందం విషయంలో బయటకు చెప్పకూడదని ఒప్పందం ఉందని కేంద్ర రక్షణ శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ చెప్పారని ఆయన గుర్తుచేశారు. కానీ, ఫ్రాన్స్ అధ్యక్షుడు ఇండియా పర్యటనకు వచ్చిన సమయంలో తాను ఈ విషయాన్ని అడిగినట్టు చెప్పారు. ఈ ఒప్పందాన్ని రహస్యంగా ఉంచాల్సిన అవసరం లేదని ఫ్రాన్స్ అధ్యక్షుడు తనతో చెప్పారని ఆయన ప్రస్తావించారు. 

మోడీతో పాటు ఫ్రాన్స్‌కు వెళ్లాడు. మోడీ స్నేహితుడు అనిల్ అంబానీ కూడ ఫ్రాన్స్ వెళ్లాడని ఆయన గుర్తుచేశాడు. రాఫెల్ విమానాల కొనుగోలులో భారీగా ప్రజలను మోసం చేశారని ఆయన చెప్పారు.

హిందూస్తాన్ ఏరోనాటికల్స్ 70 ఏళ్లుగా విమానాలను తయారు చేస్తున్నారని చెప్పారు. కానీ, రాఫెల్ యుద్ద విమానాల తయారీ కోసం ధరలను మూడు రేట్లు పెంచారని ఆయన చెప్పారు.

మోడీ స్నేహితుడు ఒక్క విమానం కూడ తయారు చేయలేదని ఆయన విమర్శలు గుప్పించారు. ప్రజల సొమ్ముతో కొనుగోలు చేసిన విమానాల గురించి ప్రజలకు ఎందుకు చెప్పరని ఆయన మోడీని ప్రశ్నించారు. 

దళితులకు మూడుఎకరాల ఇళ్లను నిర్మించనున్నట్టు కేసీఆర్ హమీ ఇచ్చారని చెప్పారు. మరో వైపు ప్రతి ఒక్కరికీ డబుల్ బెడ్ రూమ్ ఇళ్లను నిర్మిస్తామని చెప్పారని ఆయన గుర్తు చేశారు. మోడీ కూడ ఇదే తరహాలో నల్లధనం తెచ్చి ప్రతి ఒక్కరికి రూ.15 లక్షలను ఇస్తామని ఇచ్చిన హమీని ప్రస్తావిస్తూ ఇద్దరూ కూడ అబద్దపు హమీలు ఇస్తున్నారని విమర్శించారు.

తెలంగాణలో కేసీఆర్ ప్రభుత్వం అవలంభించిన విధానాల కారణంగా 4 వేల మంది రైతులు ఆత్మహత్య చేసుకొన్నారని ఆయన చెప్పారు. దళిత, ఆదివాసీలను కేసీఆర్ మోసం చేశారని రాహుల్ చెప్పారు. తెలంగాణలో కుటుంబపాలన సాగుతోందన్నారు. తెలంగాణలో ఒకే కుటుంబం లబ్దిపొందుతోందన్నారు. ఒక్క శాతం భూమి కూడ దళితులకు ఇవ్వలేదన్నారు. ఒక్క హమీని కూడ కేసీఆర్ నిలుపుకోలేదన్నారు

కాంగ్రెస్ పార్టీ కేంద్రంలో అధికారంలోకి వస్తే తెలంగాణ, ఆంధ్ర రాష్ట్రాల ప్రజలు సమస్యలను పరిష్కరిస్తామని రాహుల్ గాంధీ హమీ ఇచ్చారు. అవినీతికి హైద్రాబాద్ రాజధానిగా మారిందని రాహుల్ గాంధీ విమర్శలు చేశారు. మేం తప్పుడు వాగ్దానాలు చేయబోమని రాహుల్ చెప్పారు.

జీఎస్టీ, నోట్ల రద్దు విషయంలో మోడీ సర్కార్‌కు మద్దతు పలికిని కేసీఆర్ తెలంగాణకు రావల్సిన నిధుల గురించి మోడీని కేసీఆర్ ఎందుకు ప్రశ్నించడం లేదో చెప్పాలని ఆయన డిమాండ్ చేశారు.

తెలంగాణ సర్కార్ అవలంభిస్తున్న ప్రజా వ్యతిరేక విధానాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలని ఆయన సూచించారు. మరో వైపు క్షేత్రస్థాయిలో పనిచేసేవారికే టిక్కెట్లను కేటాయించనున్నట్టు రాహుల్ ప్రకటించారు. 

దేశచరిత్రలో తొలిసారిగా మీడియా స్వేచ్ఛగా పనిచేయలేకపోతోందన్నారు రాహుల్ గాంధీ. ఎవరన్నా సూటిగా రాస్తే ఎంతగా వేధించాలో అంతగా వేధిస్తున్నారని ఆయన చెప్పారు. ఏం జరుగుతోందో ధైర్యంగా రాయాలని ఆయన మీడియాకు సూచించారు. 

ఈ వార్తలు చదవండి

ఉస్మానియాకు వెళ్లే దమ్ముందా?: కేసీఆర్‌కు జైపాల్ సవాల్

మోడీ, కేసీఆర్ సేమ్‌ టూ సేమ్: రాహుల్

కేసీఆర్ కుటుంబాన్ని తెలంగాణ నుండి తరిమికొట్టాలి: ఉత్తమ్

జైపాల్‌రెడ్డికి షాక్: శంషాబాద్ ఎయిర్ పోర్ట్‌ బయటే నిలిపేసిన పోలీసులు