తెలంగాణ సీఎం కేసీఆర్‌కు ఉస్మానియా యూనివర్శిటీకి వెళ్లే ధైర్యం ఉందా అని మాజీ కేంద్ర మంత్రి జైపాల్ రెడ్డి ప్రశ్నించారు. సీఎం కేసీఆర్‌పై ఆయన  నిప్పులు చెరిగారు.

హైదరాబాద్: తెలంగాణ సీఎం కేసీఆర్‌కు ఉస్మానియా యూనివర్శిటీకి వెళ్లే ధైర్యం ఉందా అని మాజీ కేంద్ర మంత్రి జైపాల్ రెడ్డి ప్రశ్నించారు. సీఎం కేసీఆర్‌పై ఆయన నిప్పులు చెరిగారు. 

సోమవారం నాడు గ్రేటర్ హైద్రాబాద్ పరిధిలోని శేరిలింగంపల్లిలో జరిగిన కాంగ్రెస్ పార్టీ సభలో ఆయన ప్రసంగించారు. ఉస్మానియా యూనివర్శిటీకి వెళ్లే దమ్ము కేసీఆర్‌కు ఉందా అని ఆయన ప్రశ్నించారు. ఉస్మానియా యూనివర్శిటీకీ కేసీఆర్‌ వెళ్తే విద్యార్థులు కొట్టి పంపిస్తారని ఆయన చెప్పారు. 

రాష్ట్రంలోని ఏ యూనివర్శిటీకి కూడ వెళ్లే ధైర్యం కేసీఆర్‌కు లేదన్నారు. తెలంగాణలో రామ రావణ యుద్దం సాగుతోందన్నారు. ఆనాడు రామ రావణ యుద్ధంలో అంతిమ విజయం ఎవరిదో రానున్న రోజుల్లో కూడ అంతిమయుద్దం మనదేనని ఆయన చెప్పారు. 

ముందస్తు ఎన్నికలకు కాంగ్రెస్ పార్టీ సిద్దంగా ఉందని చెప్పారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని ఏపీ విభజన చట్టం ప్రకారంగా ఆదుకోవాలని ఆయన కేంద్రాన్ని డిమాండ్ చేశారు. 

ఈ వార్తలు చదవండి

మోడీ, కేసీఆర్ సేమ్‌ టూ సేమ్: రాహుల్

కేసీఆర్ కుటుంబాన్ని తెలంగాణ నుండి తరిమికొట్టాలి: ఉత్తమ్

కేసీఆర్ కుటుంబాన్ని తెలంగాణ నుండి తరిమికొట్టాలి: ఉత్తమ్

జైపాల్‌రెడ్డికి షాక్: శంషాబాద్ ఎయిర్ పోర్ట్‌ బయటే నిలిపేసిన పోలీసులు