రైతుల జీవితాల్లో ఆనందం నింపాం: కెసిఆర్

We allocated Rs.25,000 crore in budget for irrigation projects says kcr
Highlights

తెలంగాణ ప్రజలకు కెసిఆర్ శుభవార్త

హైదరాబాద్: తెలంగాణ రాష్ట్రంలో కోటి ఎకరాలకు సాగు
నీరందించేందుకుగాను శర వేగంగా ప్రాజెక్టుల నిర్మాణ
పనులు సాగుతున్నాయని తెలంగాణ సీఎం కెసిఆర్
చెప్పారు. సమైక్య రాష్ట్రంలో తెలంగాణ ప్రాంత ప్రాజెక్టుల
పట్ల నిర్లక్ష్యం చూపారని ఆయన విమర్శించారు. ప్రాజెక్టుల
నిర్మాణం కోసం రూ. 25 వేల కోట్లను బడ్జెట్ లో
కేటాయిస్తున్నట్టు చెప్పారు.

తెలంగాణ ఆవిర్భావ దినోత్సవాన్ని పురస్కరించుకొని పరేడ్
గ్రౌండ్స్ లో  శనివారం నాడు    తెలంగాణ సీఎం కెసిఆర్
జాతీయ పతకాన్ని ఆవిష్కరించారు. పోలీసుల గౌరవ
వందనాన్ని కెసిఆర్ స్వీకరించారు.


అంతకుముందు గన్‌పార్క్ వద్ద తెలంగాణ అమరవీరుల
స్థూపానికి కెసిఆర్ నివాళులర్పించారు.

ఈ సందర్భంగా తెలంగాణ సీఎం కెసిఆర్ ప్రసంగించారు.

తెలంగాణ రాష్ట్ర సాధనకు ప్రాణాలర్పించిన అమరులకు
ఘన నివాళులు అర్పిస్తున్నాను. నాలుగేళ్ళలో బంగారు
తెలంగాణ సాధన కోసం బలమైన అడుగులు వేశాం.

సమైక్యాంధ్రలో అన్ని రంగాల్లో తీవ్రమైన అన్యాయానికి
గురయ్యామని కెసిఆర్ గుర్తు చేశారు.


ఎన్నికల మేనిఫెస్టోలో
 పొందుపర్చిన అంశాలను అమలు
చేస్తున్నాం.అనతికాలంలోనే అనేక అద్భుత విజయాలను
సాధించినట్టు కెసిఆర్ గుర్తు చేశారు.తెలంగాణ రాష్ట్ర
ప్రభుత్వం అమలు చేసిన పథకాలను ఇతర రాష్ట్రాలు
రాష్ట్రంలో పరిశీలిస్తున్నాయి. 

42 లక్షల మందికి ఆసరా పెన్షన్లు ఇస్తున్నట్టు కెసిఆర్
చెప్పారు. కళ్యాణ లక్ష్మి పధకం రూ. 1,16,000 లక్షలు
ఇస్తున్న విషయాన్ని కెసిఆర్ గుర్తు చేశారు. 

దశలవారీగా వివిద పథకాలను అమలు చేస్తున్నట్టు చెప్పారు
కెసిఆర్. రైతుల సంక్షేమం కోసం ప్రభుత్వం అనేక
కార్యక్రమాలను చేపట్టినట్టు ఆయన చెప్పారు. సమైక్య
రాష్ట్రంలో విద్యుత్ కోతలతో రైతులు తీవ్రంగా ఇబ్బందులు
పడేవారని ఆయన గుర్తు చేశారు. 24 గంటల పాటు రైతులకు
నాణ్యమైన విద్యుత్ ను సరఫరా చేస్తున్నట్టు ఆయన
చెప్పారు.  

తెలంగాణలో కోటి ఎకరాలకు సాగు నీటిని అందించేందుకు
గాను  రాష్ట్ర ప్రభుత్వం ప్రాజెక్టును నిర్మాణం చేస్తున్నట్టు
ఆయన చెప్పారు. సమైక్య రాష్ట్రంలో తెలంగాణ రాష్ట్రంలోని
ప్రాజెక్టుల పట్ల సరైన ప్రాధాన్యత ఇవ్వలేదన్నారు.సమైక్య
పాలకులు చేసిన ప్రాజెక్టుల డిజైన్లను తెలంగాణ
అవసరాలకు అనుగుణంగా రీడిజైన్లను చేసినట్టుగా కెసిఆర్
గుర్తు చేశారు.


ప్రాజెక్టుల నిర్మాణం కోసం ప్రతి ఏటా బడ్జెట్ లో రూ. 25 వేల
కోట్ల బడ్జెట్ ను కేటాయించుకొంటున్నట్టు కెసిఆర్  చెప్పారు.

 

రైతులకు ఈ ఏడాది నుండి పంట పెట్టుబడి కింద ఎకరానికి
రూ. 8వేలను చెల్లిస్తున్నట్టు చెప్పారు. రైతులు మరణిస్తే ఆ
కుటుంబాలకు భరోసా కల్పించేందుకు రూ. 5 లక్షలను
పరిహారంగా ఇవ్వనున్నట్టు ఆయన ప్రకటించారు. అయితే
రైతులు చెల్లించాల్సిన  ప్రీమియం డబ్బులను ప్రభుత్వమే
చెల్లిస్తున్నట్టు కెసిఆర్ చెప్పారు. 

మిషన్ భగీరథ ద్వారా వేలాది గ్రామాలకు రక్షిత మంచినీరు
సరఫరా చేస్తున్నట్టు ఆయన చెప్పారు. త్వరలోనే
రాష్ట్రంలోని అన్ని గ్రామాలకు మంచినీరు
అందించనున్నట్టు ఆయన చెప్పారు.

నిరుపేదల ఆత్మగౌరవం పెంచేందుకు గాను డబుల్ బెడ్
రూమ్ ఇళ్ళను నిర్మిస్తున్నాం. 2.65 లక్షలను నిర్మిస్తున్నట్టు
ఆయన చెప్పారు. హైద్రాబాద్ లోనే లక్షకు పైగా డబుల్ బెడ్
రూమ్ ఇళ్ళను నిర్మిస్తున్నట్టు ఆయన చెప్పారు.


ప్రభుత్వ ఆసుపత్రుల్లో అత్యాధునిక సౌకర్యాలను
కల్పించినట్టు కెసిఆర్ చెప్పారు.గాంధీ ఆసుపత్రిలో గవర్నర్
నరసింహన్ చికిత్స చేసుకొన్న విషయాన్ని కెసిఆర్
ప్రస్తావించారు. ప్రభుత్వాసుపత్రుల్లో పరిస్థితిని గవర్నర్
ప్రశంసించారని ఆయన తెలిపారు.ఈ ఏడాది ఆగష్టు 15
నుండి కంటి వెలుగు కార్యక్రమాన్ని నిర్వహించనున్నట్టు
కెసిఆర్ ప్రకటించారు. ఉచితంగా కంటి పరీక్షలు
నిర్వహించడమే కాకుండా ఉచితంగా కళ్ళ జోళ్ళను
అందించనున్నట్టు ఆయన తెలిపారు.


 

పరిశ్రమల స్థాపన కోసం అమలు చేస్తున్న టీ ఎస్ ఐ పాస్
విధానం  ఇతర రాష్ట్రాలకు ఆదర్శప్రాయంగా ఉంది.  
ఏడువేలకు పైగా కొత్త పరిశ్రమలు రాష్ట్రంలో వచ్చాయి. లక్ష
కోట్లకు పైగా పెట్టుబడులు వచ్చాయని కెసిఆర్ చెప్పారు. ఐటీ
పరిశ్రమను హైద్రాబాద్ తో పాటు ఇతర ప్రాంతాలకు కూడ
విస్తరిస్తున్నట్టు ఆయన చెప్పారు.

పోలీస్ కమాండ్ కంట్రోల్ 
 నిర్మాణం పూర్తి కావస్తోందని
కెసిఆర్ చెప్పారు. పేకాటను పూర్తిగా నిర్మూలించినట్టు సీఎం
చెప్పారు. అన్ని రకాల కల్తీలపై పీడీ యాక్ట్ నమోదు
చేస్తున్నట్టు కెసిఆర్ తెలిపారు.


సంకల్పం గట్టిదైతే అవరోధాలను అధిగమించే అవకాశం
ఉంది. తెలంగాణ ఉద్యమంలో కూడ ఇదే రకంగా
ఇబ్బందులు సృష్టించేందుకు ప్రయత్నాలు చేశారని,
పాలనలో కూడ ఇదే రకమైన ప్రయత్నాలు చేస్తున్నట్టుగా
కెసిఆర్ చెప్పారు. 
 


 


 

loader