తెలంగాణలో అన్నదాత కన్నెర్నజేస్తే పరిస్థితి ఎలా ఉంటుందో తెలిపే వార్త ఇది. గతంలో స్థానిక టిఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యే తమకు న్యాయం చేయడంలేదని గెదిమిన రైతులు మరోసారి అదే ఎమ్మెల్యేకు షాక్ ఇచ్చారు? ఆ వివరాలేంటో చదవండి. వీడియో చూడండి.

పెద్దపల్లి జిల్లాలోని పెద్దపల్లి ఎమ్మెల్యే దాసరి మనోహర్ రెడ్డి కి తీవ్ర వ్యతిరేకత వ్యక్తమవుతోంది. ఆయన గ్రామాల్లో తిరగలేని పరిస్థితి ఉంది. పెద్దపల్లి మండలంలోని అప్పన్నపేట గ్రామం లో పలు అభివృద్ది కార్యక్రమాల్లో పాల్గొనేందుకు వెళ్లారు. అయితే ఆ గ్రామ రైతులు సాగు నీరు అడిగితే సరైన సమాధానం చెప్పలేదు. దీంతో ఊరి పొలిమేలర వరకు రైతులు ఎమ్మెల్యేతో వాగ్వాదానికి దిగారు. వారినుంచి తప్పించుకుని వెళ్లేందుకు ప్రయత్నించిన ఎమ్మెల్యేను ఘెరావ్ చేశారు. ఎమ్మల్యేకు వ్యతిరేకంగా భారీగా రైతులు నినాదాలు చేశారు. దీంతో ఆ గ్రామంలో ఉద్రిక్త పరిస్థితి నెలకొంది. ఎట్టకేలకు పోలీసుల సాయంతో ఎమ్మెల్యే దాసరి మనోహర్ రెడ్డి అక్కడి నుంచి జారుకున్నారు. ఆ వీడియో కింద చూడండి.