కికి ఛాలెంజ్ కి ట్రెడిషనల్ టచ్.. దుమ్మురేపుతున్న వీడియో

Watch: Telangana farmer's twist to 'Kiki challenge' takes Internet by storm
Highlights

ఇటీవలే టాలీవుడ్ హీరోయిన్లు అదాశర్మ, రెజినీలు ఈ ఛాలెంజ్ లో పొల్గొన్నారు. కాగా.. ఇప్పుడు ఇలాంటి వీడియోనే ట్రెడిషనల్ గా మార్చి ఫేమస్ అయ్యారు ఇద్దరు తెలంగాణ కుర్రాళ్లు.
 

కికి ఛాలెంజ్ గురించి ప్రత్యేకంగా వివరించాల్సిన పనిలేదు. ప్రపంచవ్యాప్తంగా ఫేమస్ అయ్యింది ఈ డేంజర్ టాస్క్.  సెలబ్రెటీల దగ్గర నుంచి కామన్ పీపుల్ దాకా ఇప్పుడు ఎవరి నోట విన్నా కికీ ఛాలెంజ్ పేరే వినపడుతోంది. అంతలా పాపులరయ్యింది. ఇటీవలే టాలీవుడ్ హీరోయిన్లు అదాశర్మ, రెజినీలు ఈ ఛాలెంజ్ లో పొల్గొన్నారు. కాగా.. ఇప్పుడు ఇలాంటి వీడియోనే ట్రెడిషనల్ గా మార్చి ఫేమస్ అయ్యారు ఇద్దరు తెలంగాణ కుర్రాళ్లు.


జిగిత్యాల జిల్లా లంబాడపల్లికి చెందిన ఇద్దరు కుర్రాళ్లు.. పొలంలో పనులు చేస్తూ  పాటకి డ్యాన్స్ వేశారు. వ్యవసాయ ప్రాముఖ్యతను తెలియజేస్తూ వీరు చేసిన డ్యాన్స్ వీడియో ఇప్పుడు వైరల్ గా మారింది. ఒరిజినల్ కికీ ఛాలెంజ్ కన్నా కూడా ఇది బాగా పాపులరయ్యింది. దీంతో.. ఈ ఇద్దరు కుర్రాళ్లపై అందరూ ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు.


 

loader