దిశ హత్య జరిగిన రోజు తర్వాతే... వరంగల్ లో ఓ యువతి పుట్టిన రోజు నాడే హత్య కు గురైంది. ఆమె స్నేహితుడే... అత్యాచారం చేసి.. అనంతరం హత్య చేశాడు. కాగా.... ఆ యువతి తల్లిదండ్రులు ఇప్పుడు దిశ నిందితుల ఎన్ కౌంటర్ పై స్పందించారు.

తమ బిడ్డను చంపింది నలుగురు నిందితులని.. కానీ పోలీసులు మాత్రం ఒక్కడే అని అబద్ధం చెబుతున్నారన్నారు. తమ బిడ్డను చంపిన నిందితులను కూడా ఎన్‌కౌంటర్‌ చేయాలని ఈ సందర్భంగా వారు డిమాండ్ చేశారు. తమ బిడ్డను చిత్రహింసలు పెట్టి చంపారని బాధితురాలి తల్లిదండ్రులు చెబుతున్నారు. దిశ నిందితుల ఎన్‌కౌంటర్‌పై వారు హర్షం వ్యక్తం చేశారు.

వరంగల్ అర్బన్ జిల్లాలో పుట్టినరోజున గుడికి వెళ్లి వస్తానని తల్లిదండ్రులకు చెప్పి వెళ్లిన ఓ యువతి శవమై తేలిన సంగతి తెలిసిందే. తీరా చూస్తే ప్రియుడే ఇంటి నుంచి బయటికి రమ్మని అఘాయిత్యానికి పాల్పడినట్లు తెలిసింది. పోలీసులు నిందితుడిని తరువాతి రోజే అరెస్టు చేశారు.