వరంగల్ అర్బన్ కలెక్టర్ ఆమ్రపాలికి పెళ్లి ఫిక్స్ అయింది. యంగ్ ఎనర్జిటిక్ అండ్ డైనమిక్ అఆఫీసర్ గా పేరు తెచ్చుకున్న ఆమ్రపాలికి పెళ్లయిందా? కాలేదా అన్న అనుమానాలు చాలా మందిలో ఉండేవి. కానీ.. తాజాగా విశ్వసనీయ సమాచారం మేరకు ఆమెకు పెళ్లి కుదిరింది.

 

వరంగల్ అర్బన్ కలెక్టర్ ఆమ్రపాలి. ఏపీ , తెలంగాణ రెండు తెలుగు రాష్ట్రాల్లో ఆమ్రపాలి అంటే తెలియనివారుండరు. ఈ కలెక్టరమ్మ త్వరలోనే పెళ్ళిపీటలేక్కబోతున్నది. ఇదేంటి ఆమ్రపాలికి పెళ్లా.. నిజమేనా..? అనిపిస్తోందా? మీకు అస్సలే నమ్మకం కుదరడంలేదా? అయితే మీరు చదివింది నిజమేనండి బాబూ...

వచ్చే నెల ( ఫిబ్రవరి ) 18న ఆమ్రపాలి పెళ్లి అంగరంగ వైభవంగా జరగబోతుంది. ఇంతకీ ఆమ్రపాలి మనస్సు దోచిన అందగాడు ఎవ్వరనుకుటున్నారా..? 2011 బ్యాచ్ కి చెందిన ఐపీఎస్ ఆఫీసర్ సమీర్ శర్మ.ఆమ్రపాలి హృదయాన్ని దోచిన సమీర్ శర్మ డిల్లీ కి చెందినవారు .ప్రస్తుతం ఈయన ఎస్పీ గా పనిచేస్తున్నాడు.అయితే ఇప్పటికే ఇరువర్గాలకు చెందిన పెద్దలు పెళ్ళికి ఓకే చెప్పేశారట. ఈ వార్త తెలియడంతో ఇంతకాలం ఆమ్రపాలికి పెళ్లయిందా? కాలేదా? ఆమె భర్త ఎవరు? అన్న చర్చోప చర్చలకు పులిస్టాప్ పడినట్లేనని జనాలు చెప్పుకుంటున్నారు.

మొత్తానికి కలెక్టర్ అంటే నాలుగు గోడల మధ్య ఉంటూ డాబు దర్పం చూపేవారు కాదని.. అందరిలాగే ఉంటారని నిరూపించారు ఆమ్రపాలి. ఆమె ఏది చేసినా తెలుగు రాష్ట్రాల్లో సంచలనమే అయింది. గుట్టలెక్కి హల్ చల్ చేసినా.. రన్నింగ్  రేసుల్లో పాల్గొన్నా... ఆమె తనదైన ముద్ర వేశారు. ఆమ్రపాలి కలెక్టర్ అనే పోస్టుకు కొత్త అర్థాన్ని తెచ్చిపెట్టారనడంలో అతిశయోక్తి లేదేమో?