వరంగల్ అర్బన్ కలెక్టర్ మళ్లీ అదరగొట్టేశారు. ఆమె సరికొత్త సాహసానికి ఒడిగట్టారు. ఆమె ఏది చేసినా తెలుగు రాష్ట్రాల్లో సంచలనమే.

గతంలో తోటి కలెక్టరమ్మతో కలిసి ఫారెస్టులో నడిచి హల్ చల్ చేశారు. తర్వాత హైదరాబాద్ లో టెన్ కె రన్ లో పాల్గొని అందరినీ ఆశ్చర్యంలో ముంచెత్తారు. 

తాజాగా జయశంకర్ భూపాలపల్లి రేగొండ మండలంలోని పాండవుల గుట్టలలో నిర్వహిస్తున్న రాక్ క్లయింబింగ్ ఫెస్టివల్ లో పాల్గొని ఔరా అనిపించారు. ఈ సందర్భంగా ఆమ్రపాలి పాండవుల గుట్టలు అదిరోహించి దుమ్మురేపారు.

ఆమెతోపాటు వరంగల్ అర్బన్ డిఎఫ్ఓ అర్పనణ, జయశంకర్ భూపాలపల్లి జిల్లా డిఎఫ్ఓ రవికిరణ్ కూడా ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.

ఇలాంటి సాహసాలు ఐఎఎస్ అధికారిణి ఆమ్రపాలికి కొత్త కాదని జిల్లా అధికార యంత్రాంగం చెబుతోంది. కీపిటప్ కలెక్టరమ్మ.

 

మరిన్ని తాజా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి