హైదరాబాద్:వరంగల్‌లో చిన్నారిపై అత్యాచారం చేసి హత్య చేసిన ఘటనలో నిందితుడిని ఉరి తీయాలని డిమాండ్ చేస్తూ స్వచ్చంధ సంస్థల ప్రతినిధులు ఎర్రమంజిల్ నుండి సీఎం క్యాంప్ కార్యాలయానికి వెళ్లేందుకు ప్రయత్నించగా పోలీసులు అరెస్ట్ చేశారు.

వరంగల్‌లో ఇటీవల చిన్నారిపై అత్యాచారం చేసి హత్య చేశాడు ప్రవీణ్ అనే వ్యక్తి.  ప్రవీణ్‌ను ఉరి తీయాలని డిమాండ్ చేస్తూ స్వచ్చంధ సంస్థల ప్రతినిధులు సీఎం క్యాంప్ కార్యాలయానికి  వెళ్లేందుకు ప్రయత్నించారు. ఎర్రమంజిల్ నుండి క్యాంప్ కార్యాలయానికి ర్యాలీగా బయలుదేరిన నిరసనకారులను  పోలీసులు అడ్డుకొన్నారు. 

తనతో పాటు చిన్నారి తల్లిదండ్రులకు కూడ బెదిరింపు ఫోన్లు వస్తున్నాయని  చిన్నారి మేనమామ భరత్ చెప్పారు.  ర్యాలీలో పాల్గొంటే క్రిమినల్ కేసులు పెడతామని బెదిరింపులకు పాల్పడ్డారని ఆయన ఆరోపించారు.