హైదరాబాద్ లో బిత్తిరి సత్తిపై దాడి

హైదరాబాద్ లో బిత్తిరి సత్తిపై దాడి

ప్రముఖ టివి ఆర్టిస్టు, తెలంగాణలో నెంబర్ వన్ టివి స్టార్ గా వెలుగొందుతున్న బిత్తిరి సత్తి అలియాస్ రవిపై కొందరు గుర్తు తెలియని దుండగులు దాడి చేశారు.

ఆయన మొహంపై గాయాలయ్యాయి. ఇవాళ బిత్తిరి సత్తి తాను పనిచేస్తున్న వి6 టివి ఆఫీసు ముందు కారు దిగి ఆఫీసులోకి వెళ్తుండగా ఇద్దరు దుండగులు బైక్ మీద వచ్చి సత్తి మీద దాడి చేశారు.

సత్తి ముఖంపైనే దాడి చేయడంతో ఆయన ముఖానికి గాయాలయ్యాయి. మూతికి దెబ్బలు తగిలినయి. దాడి చేసిన దుండగులు జై భారత్... జై భారత్ అని నినాదాలు చేశారు.

అయితే చానెల్ సిబ్బంది తక్షణమే అప్రమత్తమై దాడి చేసిన దుండగులను పట్టుకుని బంధించారు. తర్వాత పంజాగుట్ట పోలీసు స్టేషన్ లో వారిద్దరినీ అప్పగించారు.

దుండగులిద్దరూ దాడి చేసిన సమయంలో ఫుల్ గా తాగి ఉన్నట్లు చెబుతున్నారు. గాయపడిన సత్తిని స్థానిక స్టార్ ఆసుపత్రికి తరలించారు.

ఈ దాడి ఎందుకు జరిగింది? ఎవరు ఈ దాడికి ప్లాన్ చేశారు? దాడి చేసిన వారెవరు అన్న వివరాలు తెలియాల్సి ఉంది.

Sign in to Comment/View Comments

Recent News

Recent Videos