Asianet News TeluguAsianet News Telugu

వరంగల్ మేయర్‌కి కార్పోరేషన్ అధికారుల ఝలక్: రూ. 2 లక్షల ఫైన్ విధింపు

అనుమతి లేకుండా వరంగల్ లో ఫ్లెక్సీలు ఏర్పాటు చేసిన వరంగల్ మేయర్ సహా పలువురికి కార్పోరేషన్ అధికారులు నోటీసులు ఇచ్చారు. మేయర్ గుండు సుధారాణికి రూ. 2 లక్షల జరిమానా విధించారు.

Warangal Corporation officials imposes Two Lakh fine to Mayor Gundu Sudha rani
Author
Warangal, First Published Apr 20, 2022, 11:13 AM IST

వరంగల్:అనుమతి లేకుండా Warangal నగరంలో Flexi లు ఏర్పాటు చేసిన వారిపై వరంగల్ కార్పోరేషన్  భారీగా జరిమానాలు విధించింది. వరంగల్ మేయర్  Gundu Sudharani కి కూడా కార్పోరేషన్ అధికారులు రూ. 2 లక్షలు ఫైన్ విధించారు. 

బుధవారం నాడు వరంగల్ జిల్లాలో  మంత్రి కేటీఆర్ పర్యటనను పురస్కరించుకొని  టీఆర్ఎస్ నేతలు పెద్ద ఎత్తున స్వాగతం తెలుపుతూ ఫ్లెక్సీలు ఏర్పాటు చేశారు.  వరంగల్ కార్పోరేషన్ అనుమతి లేకుండా ఫ్లెక్సీలు ఏర్పాటు చేయడాన్ని కార్పోరేషన్ అధికారులు చర్యలు తీసుకొన్నారు. మేయర్ గుండు సుధారాణి కూడా అనుమతి లేకుండా ఫ్లెక్సీలు ఏర్పాటు చేసిన విషయాన్ని అధికారులు గుర్తించారు.ఈ మేరకు అనుమతి లేకుండా ఫ్లెక్సీలు ఏర్పాటు చేసిన వారికి కార్పోరేషన్ అధికారులు Notices ఇచ్చారు. అంతేకాదు అనుమతి లేకుండా  ఫ్లెక్సీలు ఏర్పాటు చేసినందుకు ఫైన్ కూడా విధించారు. మేయర్ సుధారాణికి రూ. 2 లక్షల పైన్ చెల్లించాలని కూడా అధికారులు నోటీసులు ఇచ్చారు.

రాష్ట్ర వ్యాప్తంగా పలు స్థానిక సంస్థల్లో కూడా అనుమతి లేకుండా ఫ్లెక్సీలు ఏర్పాటు చేయడంపై జరిమానాలు విధించిన సందర్భాలున్నాయి. టీఆర్ఎస్ ప్లీనరీ సందర్భంగా గత ఏడాది అక్టోబర్ మాసంలో నిర్వహించారు. ఎక్కడపడితే అక్కడ భారీ కటౌట్లు ఏర్పాటు చేశారు. మంత్రులతో పాటు పలువురు టీఆర్ఎస్ ప్రజా ప్రతినిధులు కూడా గతంలో ఫైన్ చెల్లించారు. మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ కి రూ. 1.05 లక్సలు, మంత్రి మల్లారెడ్డికి రూ. 10 వేలు, ఎమ్మెల్యే దానం నాగేందర్ కు రూ., 2.05 లక్షలు, మేయర్ గద్వాల విజయలక్ష్మికి రూ. 25 వేలు, కార్పోరేటర్ రాగం నాగేందర్ యాదవ్ కి రూ. 2 లక్షలు, టీఆర్ఎస్ జనరల్ సెక్రటరీ పేరిట రూ. 95 వేలు జరిమానా విధించింది. 

మరో వైపు ఈ ఏడాది పిబ్రవరి మాసంలో కేసీఆర్ పుట్టిన రోజును పురస్కరించుకొని ఏర్పాటు చేసిన ఫ్లెక్సీలకు కూడా జీహెచ్ఎంసీ ఫైన్ విధించింది. హుస్సేన్ సాగర్ లోపల స్టీమర్ కు 40 ఫీట్ల బారీ ప్లెక్సీ ఏర్పాటు చేశారు. దీంతో ఈవీడీఎం అధికారులు  ఫైన్ విధించారు. ఈ ఫ్లెక్సీ ఏర్పాటు చేసిన టీఆర్ఎస్ నేత అరవింద్ కుమార్ కు రూ. 60 వేలు జరిమానా విధించారు.


 

Follow Us:
Download App:
  • android
  • ios