కాంట్రాక్టర్లకు కలెక్టర్ ఆమ్రపాలి స్ట్రాంగ్ వార్నింగ్

warangal collector amrapali strong warning on contractors
Highlights

24 గంటల్లో వివరణ కోరిన కలెక్టర్

ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా చేపడుతున్న మిషన్ భగీరథ పనులు జిల్లాలో ఆలస్యంగా జరుగుతుండటం పట్ల వరంగల్ అర్బన్ కలెక్టర్ ఆమ్రపాలి అసహనం  వ్యక్తం చేశారు. ఈ సథకం పనితీరుపై కలెక్టరేట్ సమావేశ మందిరంలో అధికారులతో సమీక్ష నిర్వహించిన కలెక్టర్ అధికారులకు హెచ్చరికలు జారీ చేశారు. అలాగే  పనులు చేపడుతున్న కాంట్రాక్టర్లకు కూడా సీరియస్ వార్నింగ్ ఇచ్చారు.  

జిల్లాలో మిషన్‌ భగీరథ పనులు వెంటనే పూర్తిచేయాలని కలెక్టర్‌ ఆమ్రపాలి అధికారులను ఆదేశించారు. నత్తనడకన సాగుతున్న పనుల వేగాన్ని పెంచి ఈనెల చివరి నాటికి పూర్తిచేయాలని సూచించారు. పనులు చేయడంలో అలసత్వం చూపుతున్న కాంట్రాక్టర్లపై చర్యలు తీసుకుంటామని ఆమె  హెచ్చరించారు.

ముఖ్యంగా జిల్లాలోని భీమదేవరపల్లి, ఎల్కతుర్తి మండలాల్లో మిషన్‌ భగీరథ పనులు ఆలస్యం అవుతున్నాయని ఆమె అధికారులకు సూచించారు. ఈ పనుల ఆలస్యానికి గల కారణాలను సదరు కాంట్రాక్టర్‌  24గంటల్లో తన వద్దకు వచ్చి వివరణ ఇవ్వాలని ఆదేశింంచారు. లేని పక్షంలో ఆ కాంట్రాక్టర్ పై వెంటనే చర్యలు తీసుకుంటానని గట్టిగా వార్నింగ్ ఇచ్చారు.

ఇక మిగతా చోట్ల కూడా ఏవో కారణాలు చెప్పి పనుల్లో జాప్యం చేస్తున్నారని దీన్ని సహించేది లేదని అన్నారు. ఇప్పటికే ఈ పనుల్లో జిల్లా చాలా వెనుకబడిందని,పనులు త్వరగా పూర్తిచేయడానికి కూలీలను పెంచుకోవాలని ఆమె సూచించారు. పనులు ఆలస్యం అయితే కాంట్రాక్టరే కాకుండా సంబంధిత ఇంజనీర్‌ కూడా బాధ్యత వహించాల్సి ఉంటుందన్నారు.  

loader