మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ పై కాంగ్రెస్ ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు అసెంబ్లీలో రచ్చకు కారణమయ్యాయి. కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి వ్యాఖ్యలను స్పీకర్ రికార్డుల నుండి తొలగించారు.

హైదరాబాద్: Telangana అసెంబ్లీలో TRS సభ్యులు, కాంగ్రెస్ ఎమ్మెల్యే Komatireddy Rajagoal Reddy మధ్య వాగ్వాదం చోటు చేసుకొంది. రాజగోపాల్ రెడ్డి మంత్రి Talasani Srinivas Yadav పై చేసిన వ్యాఖ్యలను రికార్డుల నుండి తొలగిస్తున్నట్టుగా స్పీకర్ Pocharam Srinivas Reddy ప్రకటించారు.

Singareni లో టెండర్లు లేకుండానే పనులు కేటాయించారని ఈ విషయమై తీవ్ర నష్టం వాటిల్లిందని కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి అసెంబ్లీలో చెప్పాురు. అయితే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి కాంట్రాక్టర్ కాబట్టే కాంట్రాక్టర్ల గురించి మాట్లాడుతున్నారని మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ విమర్శలు చేశారు. ఈ వ్యాఖ్యలపై Munugode ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి స్పందించారు. తనను కాంట్రాక్టర్ అంటూ వ్యాఖ్యానించినా కూడా తనకు ఎలాంటి ఇబ్బంది లేదని కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి చెప్పారు. ఇదే సమయంలో పేకాట ఆడిన వారు మంత్రులైతే తప్పు లేదు కానీ, కాంట్రాక్టర్లు ఎమ్మెల్యేలు అయితే తప్పేలా అవుతుందని కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి ప్రశ్నించారు. గతంలో తాను కాంట్రాక్టర్‌నని, ఇప్పుడు తాను కాంట్రాక్టు పనులు చేయడం లేదన్నారు.

మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ పై ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి చేసిన వ్యాఖ్యలను TRS సభ్యులు తప్పు బట్టారు.ఈ విషయమై శాసనసభ వ్యవహరాల శాఖ మంత్రి Vemula Prashanth Reddy స్పందించారు. సీనియర్ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ పై రాజగోపాల్ రెడ్డి చేసిన వ్యాఖ్యలను రికార్డులను తొలగించాలని డిమాండ్ చేశారు. అంతేకాదు ఈ వ్యాఖ్యలను వెనక్కి తీసుకోవాలని మంత్రి ప్రశాంత్ రెడ్డి సూచించారు.

BC సామాజిక వర్గానికి చెందిన మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ పై కాంగ్రెస్ ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి అనుచిత వ్యాఖ్యలు చేయడాన్ని రవాణా శాఖ మంత్రి Puvvada Ajay Kumar తప్పు బట్టారు. ఉమ్మడి ఏపీ రాష్ట్రంలో కూడా తలసాని శ్రీనివాస్ యాదవ్ మంత్రిగా పనిచేశారని ఆయన గుర్తు చేశారు. సీనియర్ మంత్రిపై ఈ వ్యాఖ్యలు చేయడం సరైందేనా అని రాజగోపాల్ రెడ్డిని పువ్వాడ అజయ్ కుమార్ తప్పు బట్టారు.

ఈ విషయమై CLP నేత Mallu Bhatti Vikramarka స్పందించారు. ఒక అంశంపై ఒక సభ్యుడు మాట్లాడే సమయంలో కాంట్రాక్టర్ల కోసమే మాట్లాడుతున్నారని మంత్రి అనడం తప్పు అన్నారు. మంత్రిపై తమ సభ్యుడు వ్యక్తిగతంగా వ్యాఖ్యలు చేయడం కూడా సరైంది కాదని కూడా భట్టి విక్రమార్క చెప్పారు. మంత్రిపై తమ సభ్యుడు చేసిన వ్యాఖ్యలను, తమ సభ్యుడిపై మంత్రి చేసిన వ్యాఖ్యలను రికార్డుల నుండి తొలగించాలని కోరారు.

అయితే మంత్రిపై కాంగ్రెస్ ఎమ్మెల్యే రాజగోపాల్ రెడ్డి చేసిన వ్యాఖ్యలను రికార్డుల నుండి తొలగిస్తున్నట్టుగా స్పీకర్ పోచారం శ్రీనివాస్ రెడ్డి ప్రకటించారు. ఇదిలా ఉంటే అసెంబ్లీ నుండి బయటకు వచ్చిన తర్వాత మంత్రిపై తాను చేసిన వ్యాఖ్యలను వెనక్కి తీసుకొంటున్నట్టుగా ఎమ్మెల్యే రాజగపోల్ రెడ్డి ప్రకటించారు.ఇదే విషయాన్ని సభలో కూడా ఆయన చెప్పారు.ఈ చర్చ సమయంలో కొద్దిసేపు టీఆర్ఎస్, కాంగ్రెస్ సభ్యుల మధ్య తీవ్ర స్థాయిలో ఆరోపణలు, ప్రత్యారోపణలు జరిగాయి.