అడ్వకేట్ వామన్ రావు దంపతుల హత్యకేసు: ఎఫ్ఎస్ఎల్ నివేదికకు 4 వారాలు

హైకోర్టు అడ్వకేట్ వామన్ రావు దంపతులు హత్య కేసులో  ఎఫ్ఎస్ఎల్ నివేదిక రావడానికి 4 వారాలు పట్టే అవకాశం ఉంది.
 

wamanrao couple murder case:FSL Report takes for 4 weeks lns

హైదరాబాద్: హైకోర్టు అడ్వకేట్ వామన్ రావు దంపతులు హత్య కేసులో  ఎఫ్ఎస్ఎల్ నివేదిక రావడానికి 4 వారాలు పట్టే అవకాశం ఉంది.

హైకోర్టు అడ్వకేట్  వామన్ రావు దంపతుల హత్య కేసుపై బుధవారం నాడు  తెలంగాణ హైకోర్టు విచారణ నిర్వహించింది. ఈ కేసు దర్యాప్తుపై  విచారణ తీరును అడ్వకేట్ జనరల్  హైకోర్టుకు వివరించారు. ఈ కేసులో ఇప్పటికే ఏడుగురు నిందితుల వాంగ్మూలాలు రికార్డు చేసినట్టుగా ఏజీ తెలిపారు. 32 మంది ప్రత్యక్షసాక్షుల్లో 26 మంది  వాంగూల్మం నమోదు చేసుకొన్నట్టుగా చెప్పారు.

నిందితులు ఉపయోగించిన సెల్‌పోన్లు, సిమ్ కార్డులను ఎఫ్ఎస్ఎల్ కు పంపారు. ఈ నివేదిక రావడానికి 4 వారాల సమయం పట్టే అవకాశం ఉందని ఏజీ హైకోర్టుకు తెలిపారు. మే 17 నాటికి సమగ్ర చార్జీషీటు దాఖలు చేయాలని  హైకోర్టు ఆదేశించింది.తదుపరి విచారణను ఈ నెల 23వ తేదీకి హైకోర్టు వాయిదా వేసింది.

పోలీస్ నివేదిక తమకు ఇచ్చేలా ఆదేశించాలన్న వామన్ రావు తరపు లాయర్ వాదించారు. అయితే ఈ కేసులో పూర్తి వివరాలు తెలుసుకోవాలన్నదే తమ లక్ష్యమని హైకోర్టు ధర్మాసనం తెలిపింది.
 

Latest Videos
Follow Us:
Download App:
  • android
  • ios