నిర్మల్ జిల్లా కలెక్టర్ వివాదంలో చిక్కుకున్నారు. కలెక్టర్ టెన్నిస్ ఆదే సమయంలో ఆయనకు బాల్‌బాయ్స్‌గా వ్యవహరించేందుకు 21 మంది వీఆర్ఏలకు బాధ్యతలు అప్పగించడం వివాదాస్పదమైంది.
తెలంగాణ రాష్ట్రం నిర్మల్ జిల్లా కలెక్టర్‌గా కొనసాగుతున్న ముషారఫ్ అలీ ఓ వివాదంలో ఇరుక్కున్నారు. కలెక్టర్ టెన్నిస్ ఆడుతుంటే...బంతులు అందించేందుకు ఏకంగా 21 మంది వీఆర్ఏలకు బాధ్యతలు అప్పగించారు. అది కూడా అధికారికంగా.. ఈ మేరకు ఆ జిల్లాలో ఉత్తర్వులు జారీ అయిపోయాయి. ఈ మేరకు నిర్మల్ తహసీల్దార్ శివప్రసాద్.. కలెక్టర్ టెన్నిస్ హెల్పర్లుగా 21 మంది వీఆర్ఏల పేర్లను ప్రస్తావిస్తూ ఓ జాబితాను విడుదల చేశారు.
ఈ జాబితాలోని 21 మంది వీఆర్ఏలలో రోజూ ముగ్గురు చొప్పున సాయంత్రం వేళల్లో కలెక్టర్ నివాసంలోని టెన్నిస్ గ్రౌండ్ వద్ద బంతులు అందించే విధులకు హాజరు కావాలి. ఈ జాబితా వైరల్ కావడంతో కలెక్టర్‌పై విమర్శలు వెల్లువెత్తాయి. ముషారఫ్ అలీ ఆదేశాలతోనే తహసీల్దార్ ఈ జాబితా రూపొందించారా? లేదంటే తనే అత్యుత్సాహంతో ఈ జాబితా విడుదల చేశారా? అన్నది తెలియరాలేదు.
నిజానికి ప్రభుత్వ విభాగాల్లోని ఉన్నత అధికారులు.. ఇలాంటి సేవలను అనధికారికంగా చేయించుకుంటూ ఉంటారనే విమర్శలు బ్రిటీష్ కాలం నుంచి వున్నాయి. ఎందుకంటే అలా ఉద్యోగుల్ని ఇళ్లల్లో పనులకు వాడుకోవడం తప్పు. చట్టం కూడా అంగీకరించదు.
