తెలంగాణలో కాంగ్రెస్‌కు ఓటేస్తే బీఆర్‌ఎస్‌కు వేసినట్టే.. : బీజేపీ

Telangana Assembly Elections 2023: కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ చేసిన వ్యాఖ్యలపై స్పందించిన బీజేపీ ఓబీసీ మోర్చా జాతీయ అధ్యక్షుడు, ఎంపీ డాక్టర్ కే.లక్ష్మణ్ తెలంగాణలో పార్టీ బలంగా ఉన్నందునే  బీజేపీపై విమ‌ర్శ‌లు చేస్తున్నారని ఆరోపించారు. రాహుల్ గాంధీ ఎందుకంత కంగారు పడుతున్నారో అర్థం కావడం లేదన్నారు. "తెలంగాణలో బీజేపీ బలంగా ఉంది కాబట్టే అందరూ దాడి చేస్తున్నారు. అది బీఆర్ఎస్ అయినా... మజ్లిస్ అయినా.. పూర్తిగా బీజేపీకి వ్యతిరేకం... కాంగ్రెస్, బీఆర్ఎస్ వేరు కాదు, రెండూ ఒక్కటే. వీరిద్దరికీ గురువు మజ్లిస్ పార్టీ. ఆంధ్రప్రదేశ్ అయినా, తెలంగాణ అయినా మజ్లిస్ అధికారంలో ఉన్న పార్టీతోనే ఉంది. మజ్లిస్ పార్టీని కాంగ్రెస్, బీఆర్ఎస్ పెంచాయని" ఆరోపించారు. 
 

Voting for Congress in Telangana is voting for BRS: BJP MP K Laxman RMA

BJP’s OBC Morcha National President Dr K Laxman: రాష్ట్రంలో కాంగ్రెస్ కు ఓటేస్తే అధికార బీఆర్ఎస్ కు ఓటేసినట్లేనని బీజేపీ ఓబీసీ మోర్చా జాతీయ అధ్యక్షుడు, ఎంపీ డాక్టర్ కే.లక్ష్మణ్ ఆరోపించారు. కాబ‌ట్టి వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో తెలంగాణ ప్రజలు తమకు ఓటు వేయాలని నిర్ణయించుకున్నారని తెలిపారు. కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ చేసిన వ్యాఖ్యలపై స్పందించిన బీజేపీ ఓబీసీ మోర్చా జాతీయ అధ్యక్షుడు, ఎంపీ డాక్టర్ కే.లక్ష్మణ్ తెలంగాణలో పార్టీ బలంగా ఉన్నందునే  బీజేపీపై విమ‌ర్శ‌లు చేస్తున్నారని ఆరోపించారు. రాహుల్ గాంధీ ఎందుకంత కంగారు పడుతున్నారో అర్థం కావడం లేదన్నారు. "తెలంగాణలో బీజేపీ బలంగా ఉంది కాబట్టే అందరూ దాడి చేస్తున్నారు. అది బీఆర్ఎస్ అయినా... మజ్లిస్ అయినా.. పూర్తిగా బీజేపీకి వ్యతిరేకం... కాంగ్రెస్, బీఆర్ఎస్ వేరు కాదు, రెండూ ఒక్కటే. వీరిద్దరికీ గురువు మజ్లిస్ పార్టీ. ఆంధ్రప్రదేశ్ అయినా, తెలంగాణ అయినా మజ్లిస్ అధికారంలో ఉన్న పార్టీతోనే ఉంది. మజ్లిస్ పార్టీని కాంగ్రెస్, బీఆర్ఎస్ పెంచాయని" ఆరోపించారు.

అలాగే,  ప్రధాని న‌రేంద్ర మోడీని గద్దె దించేందుకు ప్రతిపక్షాలు ఏకతాటిపైకి రావాలని రాహుల్ గాంధీ కోరుకుంటున్నార‌నీ, ప్రధాని మోడీకి వ్యతిరేకంగా కలిసి పోటీ చేయాలనేది కాంగ్రెస్ స‌హా ఇత‌ర పార్టీల ఉద్దేశ‌మ‌ని అన్నారు. తెలంగాణలో జరిగిన ఓ ఎన్నిక‌ల ప్ర‌చార ర్యాలీలో రాహుల్ గాంధీ మాట్లాడుతూ.. ఎన్నికల్లో కాంగ్రెస్, బీఆర్ఎస్ మధ్య హోరాహోరీ పోరు జరుగుతోందన్నారు. బీజేపీని పక్కన పెట్టార‌ని అన్నారు. అయితే తెలంగాణలో బీఆర్ఎస్ గెలవాలని బీజేపీ కోరుకుంటోందనీ, ఆ రెండు పార్టీలు క‌లిపి పనిచేస్తున్నాయ‌ని విమ‌ర్శించారు. కాంగ్రెస్ నేతలు రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ వాద్రా అధికార బీఆర్ఎస్, బీజేపీపై విమర్శలు గుప్పించిన మరుసటి రోజే బీజేపీ నాయ‌కుడు కే.ల‌క్ష్మ‌ణ్ స్పందిస్తూ ఘాటు వ్యాఖ్య‌లు చేశారు. 'రాహుల్, ప్రియాంక, జాగ్రత్తగా వినండి. కాంగ్రెస్ కు ఓటేస్తే బీఆర్ఎస్ కు ఓటేసినట్లేనని తెలంగాణ ఓటర్లకు తెలుసు' అని పేర్కొన్నారు.

జేపీ ఓబీసీ మోర్చా జాతీయ అధ్యక్షుడు లక్ష్మణ్ మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రాన్ని ప్రకటించడంలో జాప్యం చేసినందుకు 1,200 మంది యువకుల మరణానికి కారణమైనందుకు వారిద్దరూ క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేశారు. బుధవారం తెలంగాణలో కాంగ్రెస్ ఎన్నికల ప్రచారాన్ని ప్రారంభించిన రాహుల్ గాంధీ అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్ఎస్ గెలవాలని బీజేపీ కోరుకుంటోందని పేర్కొన్నారు. కాంగ్రెస్ ను ఓడించేందుకు బీజేపీ, బీఆర్ఎస్, అసదుద్దీన్ ఒవైసీ నేతృత్వంలోని ఎంఐఎం కలిసి పనిచేస్తున్నాయని ఆరోపించారు. భారతీయ జనతా పార్టీ, భారత రాష్ట్ర సమితి (బీఆర్ఎస్) మధ్య పరోక్ష అవగాహన ఉందని ఆరోపించారు. పార్ల‌మెంట్ లో అవ‌స‌ర‌మైన‌ప్పుడ‌ల్లా బీఆర్ఎస్ బీజేపీకి మ‌ద్ద‌తు ఇచ్చింద‌ని తెలిపారు. అలాగే, మూడు వివాదాస్పద వ్యవసాయ చట్టాలు, జీఎస్టీపై బీజేపీకి బీఆర్ఎస్ మద్దతు తెలిపిందన్నారు.

Latest Videos
Follow Us:
Download App:
  • android
  • ios