హైదరాబాద్: ఎన్నికల వేళ చిత్రాలు చోటు చేసుకుంటున్నాయి. ఓటర్లకు అందజేసే పోలింగ్ చీటీలపై ఓటర్ల ఫొటోలకు బదులు వాటి స్థానాల్లో కారు, కరెంటు బిల్లు రసీదులు, ఆధార్ కార్డులు ఉండటం గందరగోళానికి దారితీసింది.

తమ పోలింగ్ చీటీలను చూసిన ఓటర్లు ఇదేంటంటూ వాటిని పంపిణీ చేసే సిబ్బందిని నిలదీస్తున్నారు. దీంతో వారు ఏం చేయాలో తెలియక తలల పట్టుకుంటున్నారు. 

ఒకరికే రెండు, మూడు ఓట్లు ఉండటం, ఫొటోలు గుర్తించలేకుండా ఉండటంతో చీటీలు పంపిణీ చేసే సిబ్బంది నానా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. దీంతో చాలా చీటీలు పంపిణీ చేయకుండా వారి వద్దే మిగిలిపోయాయి. ఈ విచిత్ర పరిస్థితి ఎల్బీనగర్ నియోజకవర్గంలోని బండ్లగూడలో ఏర్పడింది.