Asianet News TeluguAsianet News Telugu

మీ దగ్గర ఓటర్ ఐడీ లేదా..? అయితే క్షణాల్లో డిజిటల్ ఐడీని పొందండిలా..!! 

రేపే తెలంగాణలోని 17 లోక్ సభ స్థానాల్లో పోలింగ్. ఈ సమయంలో మీ  ఓటర్ ఐడీ కార్డు కనిపించడం లేదా... ఏం కంగారు పడకండి. చాలా ఈజీగా డిజిటల్ ఓటర్ ఐడీ కార్డును డౌన్లోడ్ చేసుకొండి. ప్రాసెస్ ఏమిటంటే...

Voter ID Card download process in online AKP
Author
First Published May 12, 2024, 1:28 PM IST

హైదరాబాద్ : తెలుగు రాష్ట్రాల్లో పోలింగ్ కు కౌంట్ డౌన్ షురూ అయ్యింది. ఆంధ్ర ప్రదేశ్ లో లోక్ సభతో పాటే అసెంబ్లీ  ఎన్నికలు కూడా జరుగుతున్నాయి. అలాగే తెలంగాణలో కూడా లోక్ సభ ఎన్నికలు జరుగుతున్నాయి. ఈ క్రమంలోనే ఓటర్ ఐడీ కార్డుల పని పడింది. ఓటు హక్కును వినియోగించుకోవాలంటే ఓటర్ ఐడీ అవసరం. ఒకవేళ మీవద్ద ఓటర్ ఐడీ లేకుండా చాలా ఈజీగా డిజిటల్ ఓటర్ కార్డు డౌన్ లోడ్ చేసుకోవచ్చు.

డిజిటల్ ఓటర్ ఐడీ డౌన్లోడింగ్ ప్రాసెస్ : 
 
ముందుగా కేంద్ర ఎలక్షన్ కమీషన్ అధికారిక వెబ్‌సైట్  https://voters.eci.gov.in/login ను ఓపెన్ చేయండి 

ఈ వెబ్ సైట్ లో మొబైల్ నంబర్ తో రిజిస్ట్రేషన్ కావాలి. మొబైల్ నంబర్ ఎంటర్ చేసిన తరువాత మొబైల్‌కి OTP వస్తుంది. దాన్ని ఎంటర్ చేస్తే, పాస్‌వర్డ్ సెట్ చేసుకోమని అడుగుతుంది. అలా పూర్తి చేయగానే రిజిస్ట్రేషన్ పూర్తవుతుంది. 

తర్వాత మీరు మొబైల్ నంబర్, పాస్‌వర్డ్, కాప్చా నంబర్ ఎంటర్ చేసి లాగిన్ అవ్వాలి.

 ఆ తర్వాత request OTPపై క్లిక్ చెయ్యాలి. మీ మొబైల్ కి వచ్చిన OTPని ఎంటర్ చేసి, verify & login పై క్లిక్ చెయ్యాలి.

 ఇప్పుడు మీకు సైట్ లో కుడివైపు కింద మూలకు  E-EPIC Download కనిపిస్తుంది. దానిపై క్లిక్ చెయ్యాలి.

ఆ తరువాత Enter EPIC_NO అని కనిపిస్తుంది. అక్కడ మీ ఓటర్ ఐడీ కార్డుకి సంబంధించిన 10 అంకెల యునిక్ EPIC నంబర్‌ను నమోదు చేయాలి. తర్వాత Select Stateలో మీ రాష్ట్రంని సెలెక్ట్ చేసుకోవాలి. తర్వాత Search బాక్స్ క్లిక్ చెయ్యాలి.

వెంటనే స్క్రీన్ పై ఓటర్ ఐడీకి సంబంధించిన వివరాలు కనిపిస్తాయి. ఆ వివరాలు సరైనవే అని మీకు అనిపిస్తే, అప్పుడు మీరు కింద ఉన్న send OTP క్లిక్ చెయ్యాలి.

మీ మొబైల్ నంబర్‌కు OTP వస్తుంది, మొబైల్‌కి వచ్చిన OTPని ఎంటర్ చేసి, verify బాక్స్ క్లిక్ చెయ్యాలి. 

 ఆ తర్వాత మీకు  PDF రూపంలో డిజిటల్ ఓటర్ ID కనిపిస్తుంది. డిజిటల్ ఓటర్ ఐడీ కార్డు కోసం… download e-EPIC క్లిక్ చెయ్యాలి. వెంటనే  pdf ఫార్మాట్‌లో సేవ్ అవుతుంది.

అలా డౌన్ లోడ్ చేసుకున్న ఫైల్ ను అవసరమైతే.. ప్రింట్ తీసుకోవచ్చు. లేమినేషన్ చేయించుకుని ఆధార్ కార్డ్ తరహాలో వాడుకోవచ్చు. లేదా మొబైల్‌లోనే సేవ్ చేసుకొని, అవసరమైనప్పుడు, ఎవరైనా అధికారులకు చూపించవచ్చు.

గమనిక: డిజిటల్ ఓటర్ ఐడీ కోసం మొబైల్ నంబర్‌ను ఓటర్ ఐడీ కార్డుకు అనుసంధానం చేయడం తప్పనిసరి. అటువంటి పరిస్థితిలో వినియోగదారులు ముందుగా KYC పూర్తి చేయాలి.  అప్పుడు మీరు ఇ-ఓటర్ ఐడి కార్డును డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. 
 

Latest Videos
Follow Us:
Download App:
  • android
  • ios