పెళ్లికి గిఫ్ట్‌ వద్దు: మోడీకి ఓటేయాలని ఆహ్వానపత్రికలో కోరిన సంగారెడ్డి వాసి

పెళ్లికి వచ్చేవారికి గిఫ్ట్ లు వద్దని చెబుతూనే  పెళ్లికొడుకు  పేరేంట్స్  వినూత్నమైన కోరిక కోరారు. ఎన్నికల సమయంలో ఈ కోరిక ప్రస్తుతం చర్చకు దారి తీసింది. 
 

 Vote for PM Modi instead of gifts says groom s dad in wedding card lns

హైదరాబాద్:  తెలంగాణ రాష్ట్రంలోని సంగారెడ్డి జిల్లాలో తన కొడుకు పెళ్లికి  పెళ్లి కొడుకు తండ్రి  ప్రత్యేకమైన ఆహ్వానం పంపారు.

తన కొడుకు పెళ్లికి వచ్చే వారంతా  ఎలాంటి బహుమతులు తీసుకురావద్దని కోరారు. అయితే  త్వరలో జరిగే  ఎన్నికల్లో  ప్రధానమంత్రి నరేంద్ర మోడీకి ఓటు వేయాలని  వివాహా ఆహ్వాన పత్రికలో ఆయన కోరారు. ఇదే తన కొడుకు పెళ్లికి మీరు ఇచ్చే  పెద్ద గిఫ్ట్ అంటూ  పెళ్లి కొడుకు తండ్రి  ఆ పెళ్లి పత్రికలో పేర్కొన్నారు.

నందికంటి నర్సింహులు, నందికంటి నిర్మల దంపతులు తమ కొడుకు సాయికుమార్ పెళ్లి చేయాలని నిర్ణయం తీసుకున్నారు.  సాయికుమార్ కు, మహిమ రాణితో వివాహం నిశ్చయించారు.నర్సింహులు   భవన నిర్మాణాలకు సంబంధించిన ఉడెన్ మెటీరియల్ ను సరఫరా చేస్తుంటారు. సంగారెడ్డి జిల్లాలోని కంది మండలంలోని ఆరుట్ల గ్రామం నర్సింహులుది.

నర్సింహులు ఇప్పటికే తన ఇద్దరు కూతుళ్ల వివాహలు జరిపించారు. తన కొడుకు సాయికుమార్ పెళ్లి జరిపించాలని నిర్ణయం తీసుకున్నారు. ఈ ఏడాది ఏప్రిల్  4న  పటాన్ చెరులో  ఈ వివాహం జరగనుంది.  

అయితే ఇప్పటికే లోక్ సభ ఎన్నికల షెడ్యూల్ విడుదలైంది. దరిమిలా  ఈ పెళ్లి సమయంలో నరేంద్ర మోడీకి ఓటేయాలి..పెళ్లికి ఎలాంటి ఓటు వేయవద్దని కోరాలని తమ కుటుంబ సభ్యులు  కోరినట్టుగా  నర్సింహులు  చెప్పారని టైమ్స్ ఆఫ్ ఇండియా కథనం ప్రచురించింది.

గతంలో కూడ ఇదే తరహలో  మోడీకి ఓటు వేయాలని  కోరిన సందర్భాలు కూడ లేకపోలేదు. ఉజ్జయినిలోని దౌలత్ గంజ్ ప్రాంతానికి చెందిన విత్తన వ్యాపారి బాబులాల్ రఘువంశీ తమ ఇంట్లో పెళ్లి సమయంలో ఇలానే కోరిన విషయం తెలిసిందే.2019 ఎన్నికల సమయంలో కూడ హైద్రాబాద్ కు చెందిన వై.ముఖేష్ రావు  కుటుంబ సభ్యులు కూడ ఇదే తరహలో  పెళ్లి పత్రికలను ముద్రించారు. 

Latest Videos
Follow Us:
Download App:
  • android
  • ios