రాహుల్ గాంధీ సమక్షంలో కాంగ్రెస్ లో చేరిన ఒంటేరు ప్రతాప్

Vonteru Pratap Reddy joins in Congress in the presence of Rahul Gandhi
Highlights

ఎర్రబెల్లి అల్లుడు, ఉపాధ్యాయ నేత హర్షవర్దన్ కూడా

ఎఐసిసి అధ్యక్షులు రాహుల్ గాంధీ సమక్షంలో కాంగ్రెస్ పార్టీలో చేరారు ఒంటేరు ప్రతాప్ రెడ్డి. ఆయన టిడిపిలో కీలక నేతగా చెలామణి అయ్యారు. రైతు విభాగం అధ్యక్షులుగా పనిచేశారు. గజ్వెల్ లో సిఎం కేసిఆర్ కు ప్రత్యర్థిగా ఆటుపోట్లను ఎదుర్కొని టిడిపిలో పనిచేశారు. అయితే టిడిపి నేతలంతా వలసబాట పట్టడంతో ఒంటేరు కూడా కాంగ్రెస్ పార్టీలో చేరారు. ఢిల్లీలో రాహుల్ గాంధీ ఒంటేరు ప్రతాప్ తోపాటు ఎర్రబెల్లి దయాకర్ రావు అల్లుడు మదన్ మోహన్ రావు, ఉపాధ్యాయ సంఘం నేతగా ఉండి గత ఎన్నికల్లో మహబూబ్ నగర్, హైదరాబాద్, రంగారెడ్డి గ్రాడ్యూయేట్ స్థానం నుంచి పోటీ చేసిన హర్షవర్దన్ రెడ్డి కూడా కాంగ్రెస్ పార్టీలో చేరారు. హర్ష వర్దన్ రెడ్డి గతంలో ఉపాధ్యాయ సంఘంలో కీలక నేతగా పనిచేశారు. ఈ కార్యక్రమంలో పిసిసి చీఫ్ ఉత్తమ్ కుమార్ రెడ్డి, షబ్బీర్ అలీ, సునీత లక్ష్మారెడ్డి తదితరులు పాల్గొన్నారు.

loader