కల్వకుంట్ల కుటుంబం వల్లే హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ (హెచ్‌సీఏ) భ్రష్టు పట్టిందని మాజీ ఎంపీ వివేక్ వెంకటస్వామి విమర్శించారు. హెచ్‌సీఏలో ఇలాంటి గందరగోళం గతంలో ఎప్పుడూ చూడలేదని అన్నారు.

కల్వకుంట్ల కుటుంబం వల్లే హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ (హెచ్‌సీఏ) భ్రష్టు పట్టిందని మాజీ ఎంపీ వివేక్ వెంకటస్వామి విమర్శించారు. సెప్టెంబర్ 25వ తేదీన ఉప్పల్ స్టేడియంలో జరిగే భారత్-ఆస్ట్రేలియా టీ20 మ్యాచ్ టికెట్ల విక్రయాలపై వైట్ పేపర్ విడుద చేయాలని డిమాండ్ చేశారు. హెచ్‌సీఏ ప్రెసిడెంట్‌గా అజారుద్దీన్ ఫెయిలయ్యాడని విమర్శించారు. కవితను హెచ్‌సీఏ అధ్యక్షురాలిని చేయాలని కేసీఆర్ చూస్తున్నారని అన్నారు. కూతురు కోసం హెచ్‌సీఏ ఎన్నికల్లో తనను పోటీ చేయొద్దని కేసీఆర్ అన్నారని చెప్పారు. రాజకీయాల్లో ఉన్నందున హెచ్‌సీఏ పదవి ఎందుకని తనను కేసీఆర్ అడిగారని తెలిపారు.

కవితను హెచ్‌సీఏ ప్రెసిడెంట్ చేయటానికి సీఎం కేసీఆర్ గేమ్ ఆడి విఫలమయ్యారని ఆరోపించారు. గతంలో తన ప్యానల్‌ను ఓడించటానికి కేటీఆర్ విఫలయత్నం చేశారని ఆరోపించారు. హెచ్‌సీఏలో ఇలాంటి గందరగోళం గతంలో ఎప్పుడూ చూడలేదని వివేక్ అన్నారు. 

Also Read: మంత్రులతో హెచ్‌సీఏ కుమ్మక్కు... 32 వేల టికెట్లు అమ్మాలి, ఎన్ని అమ్ముడయ్యాయి: అజారుద్దీన్‌పై మహేశ్ గౌడ్ ఆరోపణలు

ఇక, ఆస్ట్రేలియా - ఇండియా టీ20 మ్యాచ్ టికెట్ల కోసం పెద్ద ఎత్తున అభిమానులు జింఖానా గ్రౌండ్‌కు తరలిరావడంతో అక్కడ తొక్కిసలాట చోటుచేసుకున్న సంగతి తెలిసిందే. అయితే టికెట్లు బ్లాక్‌లో అమ్ముడయ్యాయని క్రికెట్ అభిమానులు ఆరోపిస్తున్నారు. అయితే ఈ ఆరోపణలను హెచ్‌సీఏ అధ్యక్షడు అజారుద్దీన్ ఖండించారు. జింఖాన్ గ్రౌండ్స్‌ వద్ద జరిగిన తొక్కిసలాటలో హెచ్‌సీఏకు సంబంధం లేదని అన్నారు. తాను ఏ తప్పూ చేయలేదని, తొక్కిసలాటలో తన తప్పుంటే అరెస్ట్ చేయవచ్చని పేర్కొన్నారు.

టికెట్లు బ్లాక్‌లో అమ్ముడయ్యాడనేది అవాస్తవం అని అన్నారు. అమ్మిన అన్ని టిక్కెట్ల జాబితా నా దగ్గర ఉందని చెప్పారు. అన్ని రికార్డు చేయబడ్డాయని.. దాచేందుకు ఇందులో ఏమి లేదని చెప్పారు. టికెట్లకు సంబంధించి.. బ్లాక్‌లో అమ్ముడయ్యాయని అనడం తప్పుడు అభిప్రాయం అని పేర్కొన్నారు.