తెలంగాణ గవర్నర్ తమిళి సైని కలిసిన విశ్వహిందూ పరిషత్, భాగ్యనగర్ గణేష్ ఉత్సవ సమితి సభ్యులు..
హైదరాబాద్ లో జరుగుతున్న పరిణామాలపై గవర్నర్ తమిళిసైని కలిసి ఫిర్యాదు చేశారు విశ్వహిందూ పరిషత్, భాగ్యనగర్ గణేష్ ఉత్సవ సమితి సభ్యులు. గణేష్ ఉత్సవాలపై ఎటువంటి అడ్డంకులు రాకుండా చర్యలు తీసుకోవాలని అభ్యర్థించారు.
హైదరాబాద్ : రాజ్ భవన్ లో విశ్వహిందూ పరిషత్, భాగ్యనగర్ గణేష్ ఉత్సవ సమితి సభ్యులు తెలంగాణ గవర్నర్ ను కలిశారు. వీహెచ్పి రాష్ట్ర అధ్యక్షుడు రామరాజు నగరంలో జరుగుతున్న పరిణామాల పై గవర్నర్ కు ఫిర్యాదు చేశారు. రాష్ట్రంలో కేసీఆర్ పాలిస్తుంటే.. ఇక్కడ ఎంఐఎం పాలిస్తుందని.. ప్రభుత్వం రాజీనామా చేయాలని అన్నారు. ఈ ఫిర్యాదు మీద గవర్నర్ గారు కూడా సానుకూలంగా స్పందించారు.
కావాలనే నగరంలో విద్వేషాలు రెచ్చగొడుతున్నారు. అమాయకులను చిత్రహింసలకు గురి చేస్తున్నారు. కేంద్రానికి ఉన్నది ఉన్నట్టుగా నివేదిక ఇవ్వాలని చెప్పాం.. అని గణేష్ ఉత్సవ కమిటీ అధ్యక్షుడు భగవంత రావు గవర్నర్ కు తెలిపారు. అంతేకాదు రాష్ట్రంలో పోలీస్, ప్రభుత్వం నిమ్మకు నీరెత్తినట్లు ఉంది. మునావర్ ఫారూఖీ షో అవసరమా...వేలాది 4మంది పోలీసులతో బందోబస్తు అవసరమా? మతోన్మాద శక్తులు నగరాన్ని నాశనం చేస్తున్నాయి. మైనారిటలను ఉసిగొల్పి పబ్బం గడుపుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.
శరీరం నుండి తలలు తీసేయండి అన్న వారిపై చర్యలు తీసుకోలేదు. గణేష్ ఉత్సవాలపై ఎటువంటి అడ్డంకులు లేకుండా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలి అని గవర్నర్ ను కోరారు.
రాజాసింగ్ అరెస్ట్: హైద్రాబాద్ పాతబస్తీలో పోలీసుల హైఅలెర్ట్