శాస్త్ర సాంకేతిక రంగాల్లో భారతదేశం దూసుకెళ్తున్నప్పటికీ ఇప్పటికీ గ్రామ సీమల్లో మూఢనమ్మకాలతో పాటు న్యాయం కోసం పోలీసులను ఆశ్రయించకుండా తమలో తాము పరిష్కరించుకుంటూ నేరస్తులకు అనారికమైన శిక్షలను విధిస్తున్నారు. ఇందుకు సంబంధించి అప్పుడప్పుడూ వార్తలను వింటూ వుంటాం.

Also Read:మైనర్‌ బాలికపై లైంగిక దాడి: శీలానికి వెల కట్టిన పెద్దలు

తాజాగా తెలంగాణ రాష్ట్రంలో ఇలాంటి సంఘటనే ఒకటి జరిగింది. వివరాల్లోకి వెళితే. వరంగల్ రూరల్ జిల్లా రామపర్తి మండలంలోని ఓ తండాకు చెందిన అబ్బాయి, పక్క గ్రామానికి చెందిన అమ్మాయిపై అత్యాచారం చేసేందుకు ప్రయత్నించాడు.

దీంతో అతను చేసిన నేరంపై గ్రామస్తులు.. పెద్ద మనుషుల సమక్షంలో పంచాయతీ పెట్టారు. ఈ క్రమంలో ఆ యువకుడికి శిక్షగా రూ.2 లక్షల జరిమానా విధించినట్లు సమాచారం.

Also Read:గిన మైకంలో స్నేహితుడి భార్య శీలంపై కామెంట్స్... చివరకు.

ఆ మొత్తాన్ని పెద్ద మనుషులే తలాకొంత పంచుకున్నట్లు తెలిసింది. అయితే బాధితురాలి కుటుంబానికి ఒక్క రూపాయి కూడా ఇవ్వకపోవడంతో గ్రామస్తులు పెద్ద మనుషులపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.