భర్త విదేశాల్లో ఉన్నాడు. భార్య ఒంటరిగా ఉంటోంది. ఈ క్రమంలో మరో వ్యక్తితో ఏర్పడిన పరిచయం ఆమెను వివాహేతర సంబంధానికి దారితీసింది. అయితే... ఈ విషయం తెలుసుకున్న గ్రామస్థులు మాత్రం ఆమెను వదిలిపెట్టలేదు.  ట్రాక్టర్ కి కట్టేసి మరీ చితకబాదారు. ఈ సంఘటన సిరిసిల్ల జిల్లా బోనాల గ్రామంలో చోటుచేసుకుంది.

పూర్తి వివరాల్లోకి వెళితే... బోనాల గ్రామానికి చెందిన కున్న నాగరాజు ఉద్యోగరీత్యా విదేశాల్లో ఉంటున్నాడు. భార్య లావణ్య ఒంటరిగా ఉంటోంది. కాగా... అదే గ్రామానికి చెందిన పడగే నారాయణ అనే వ్యక్తితో ఇటీవల ఆమెకు ఏర్పడిన పరిచయం వివాహేతర సంబంధానికి దారి తీసింది. నారాయణకు భార్య ఇద్దరు పిల్లలు ఉన్నారు. వారిని పట్టించుకోకుండా లావణ్యతో గడుపుతున్నాడు.

దీంతో... ఈ విషయం నారాయణ భార్యతోపాటు గ్రామస్థులకు కూడా తెలిసిపోయింది. దీంతో నారాయణ.. లావణ్య తో కలిసి వేరే ప్రాంతానికి పారిపోయాడు. అక్కడ వేరే ఇళ్లు అద్దెకు తీసుకొని నివసిస్తున్నారు. సమాచారం తెలుసుకున్న గ్రామస్థులు వారి ఆచూకీ కనుక్కున్నారు. అక్కడికి వెళ్లి ఇద్దరినీ పట్టుకొని స్వగ్రామానికి తీసుకువచ్చారు. అనంతరం లావణ్యను ట్రాక్టర్ కి కట్టేసి దారుణంగా చితకబాదారు. పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.