నిజామాబాద్ జిల్లా సిరికొండ పీఎస్ దగ్గర ఉద్రిక్తత చోటు చేసుకుంది. గత శనివారం న్యావనంది గ్రామంలో ఓ మహిళ అత్యాచారం, హత్యకు గురైంది. ఈ కేసు దర్యాప్తులో పోలీసులు జాప్యం చేస్తున్నారని ఆరోపిస్తూ 20 ట్రాక్టర్లలో సిరికొండ పోలీస్ స్టేషన్‌కు వెళ్లారు గ్రామస్తులు.

అయితే వారిని గ్రామ శివార్లలో అడ్డుకున్నారు పోలీసులు. అయినా గ్రామస్తులు వెనక్కి తగ్గలేదు. పాదయాత్రగా వెళ్లి పోలీస్ స్టేషన్‌ ముందు బైఠాయించారు. కేసు విచారణలో పోలీసుల జాప్యంపై పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. నిందితులను త్వరగా పట్టుకోవాలని గ్రామస్తులు డిమాండ్ చేస్తున్నారు.