Asianet News TeluguAsianet News Telugu

వేలల్లో కరెంట్ బిల్లులు: సిబ్బందిని అడ్డుకున్న షాద్‌నగర్ వాసులు

రంగారెడ్డి జిల్లా షాద్‌నగర్‌లో కరెంట్ బిల్లులు వసూలు చేసే సిబ్బందిని అడ్డుకున్నారు గ్రామస్తులు. గతంలో తమ ఇళ్లకు సుమారు రూ.200 నుంచి రూ.400 మాత్రమే కరెంట్ బిల్లు వచ్చేదని.. కానీ ఈ నెల మాత్రం రూ.11,000 నుంచి రూ.15,000 వరకు బిల్లు వచ్చిందని వాపోయారు

villagers protest against power bills in shadnagar
Author
Hyderabad, First Published Jun 5, 2020, 6:25 PM IST

రంగారెడ్డి జిల్లా షాద్‌నగర్‌లో కరెంట్ బిల్లులు వసూలు చేసే సిబ్బందిని అడ్డుకున్నారు గ్రామస్తులు. గతంలో తమ ఇళ్లకు సుమారు రూ.200 నుంచి రూ.400 మాత్రమే కరెంట్ బిల్లు వచ్చేదని.. కానీ ఈ నెల మాత్రం రూ.11,000 నుంచి రూ.15,000 వరకు బిల్లు వచ్చిందని వాపోయారు.

కాయకష్టం చేసుకుని బతికే తమకు వేలల్లో బిల్లులు వస్తే ఎక్కడి నుంచి తెచ్చి కట్టాలని నిలదీశారు. లాక్‌డౌన్ సమయంలో బతికేందుకే కష్టంగా వుందని వారు ఆవేదన వ్యక్తం చేశారు. కరోనా సమయంలో తమ షాపులు మూసివేసినప్పటికీ ఇంత బిల్లు ఎలా వచ్చిందో తెలియడం లేదని గ్రామస్తులు వాపోయారు. ఇందుకు సంబంధించిన మరిన్ని వివరాలు తెలియాల్సి వుంది. 

Follow Us:
Download App:
  • android
  • ios