టిఆర్ఎస్ ఎమ్మెల్యే ఇంటినే ముట్టడించారు (వీడియో)

villagers lay siege to TRS MLA House for Road
Highlights

  • చిన్న సమస్య కోసం పెద్ద పోరాటం
  • ఆత్మకూరు గ్రామస్థుల పోరుబాట

ఇటీవల కాలంలో పరకాల ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి బాగా వార్తల్లో ఉంటున్నారు. గతంలో ఆయన కుటుంబసభ్యులు మంత్రి పదవి కోసం చిత్రవిచిత్రమైన పూజలు చేసి వివాదంలో చిక్కుకున్నారు. కానీ ఆయన పూజలు చేసి నాలుగైదు నెలలు అవుతున్నా ఇంకా ఆయనకు మంత్రి పదవి రాలేదు.

ఇక ఆ విషయం పక్కనపెడితే మరోసారి చల్లా ధర్మారెడ్డి వార్తల్లో నిలిచారు. పరకాల నియోజకవర్గంలోని ఆత్మకూరు మండలానికి చెందిన పెద్దపూర్ గ్రామస్తులు చల్లా ధర్మారెడ్డి ఇంటిని ముట్టడించారు. ఇంటి ముందు బ్యానర్ పట్టుకుని ధర్నా చేశారు. చిన్న సమస్య కోసం వారు అంత పెద్ద ఆందోళన చేశారు. తమ గ్రామం మధ్య నుంచి రోడ్డు నిర్మించాలని ఈ గ్రామస్తులు ఎప్పటినుంచో కోరుతున్నారు. దానికోసం వినతులెన్ని చేసినా.. పాయిదా లేకపోవడంతో లాస్ట్ కు ఏకంగా ఇటిమీదికి వచ్చి ధర్నా చేయాల్సి వచ్చిందని గ్రామస్తులు ఆవేదన వ్యక్తం చేశారు.

ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి గారూ... ఆ ఊరోళ్ల పరేషాన్ తీర్చండి సార్.. జర.

loader